షార్ట్ ఫిలిం కోసం సీతగా నటించిన మధుశాలిని

హీరోయిన్ మధుశాలిని సీతగా మారింది. సీతావలోకనం అనే షార్ట్ ఫిలింలో సీత పాత్రలో మధుశాలిని కనిపించబోతోంది. మాదాల వేణు ఈ లఘు చిత్రానికి దర్శకుడు. రామాయణంలోని సీతా ఘట్టాన్ని తీసుకొని రచించిన కథ ఇది. అహల్యకు సీత చెప్పే కథే సీతావలోకనం. షూటింగ్ కూడా పూర్తయింది.

ఇందులో డైలాగ్స్ అన్నీ గ్రాంథికంలో ఉంటాయి. ఇలాంటి పాత్రలో తాను ఇంతవరకు చేయలేదని మధు శాలిని చెబుతోంది. డైలాగ్స్ కోసం చాలా కష్టపడిందట. రెడ్ ఎపిక్ కెమెరాతో ఈ షార్ట్ ఫిలిం రూపొందించారు. నా పాత్రకు నేను మా అమ్మ కలిసి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకున్నామని మధు అంటోంది. ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. సుభాష్ సంగీతమందించాడు. పలు షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్ కు ఈ లఘు చిత్రాన్ని పంపిస్తారు.