హారే రామా.. మహారాష్ట్రకు హారన్ నచ్చలేదట..

మహారాష్ట్ర సర్కార్ ఈ మధ్య తెలివిమీరుతోంది. ఆ ప్రభుత్వానికి ఎప్పుడు ఎవరిపైన కోపమొస్తుందో తెలియడం లేదు. మొన్నటికి మొన్న బ్లడ్ రిలేషన్ షిప్ కాని వారిని అంకుల్ అని పిలవద్దంటూ ఆజ్ఞలు జారీ చేసిన  ప్రభుత్వం ఇప్పుడు అలాంటిదే మరో కొత్త మేటర్ తో వార్తల్లోకెక్కింది.ఇకపై  వాహనాల వెనుక హారన్ ఓకే ప్లీజ్ అనే అక్షరాలను రాయోద్దంటూ ఆ రాష్ట్ర రవాణా శాఖ నిషేదాజ్ఞలు పాస్ చేసింది. హారన్ ఓకే ప్లీజ్ అని రాయడం వల్ల వాహనదారులను హారన్ కొట్టాల్సిందిగా ప్రోత్సహిస్తున్నట్లుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో ఇకపై అలాంటి రాతలకు రాష్ట్రంలో తావులేదంటూ గట్టిగా చెప్పేసేంది..

మహారాష్ట్రలో ఇలాంటివి కొత్తేం కాదు.. మొన్న ఆవు మాంసాన్ని, అంతకుముందు పతంగులు ఎగరేసేందుకు ఉపయోగించే మంజాను వాడద్దంటూ  కూడా వరుసగా ఉత్తర్వులు జారీచేస్తూ వచ్చింది. ఇలా వింత ఆదేశాలు ఇస్తున్న ప్రభుత్వంపై ఇప్పటికే అక్కడి ప్రజలు మండిపడిపోతున్నారు.ఇంకా ఏం చేస్తుందో చూడాలి మరి మహా సర్కార్.