మహర్షి మూవీ రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ వస్తుందంటే ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు. మహర్షి సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. దానికి తగ్గట్టే గ్రాండియర్ గా ఈ సినిమాను నిర్మించి బిజినెస్ కూడా చేశారు. వంశీ పైడిపల్లి భారీ ఖర్చుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. పూజా హెగ్డే నిర్మాత. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. హై ఎక్స్ పెక్టేషన్స్ నడుమ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఏలా ఉందో చూద్దాం.

కథేంటంటే….
రిషి కుమార్ (మహేష్ బాబు) ఆరిజన్ అనే సంస్థకు సీఈఓ. రిషి కుమార్ అమెరికాలోని ఆరిజన్ సంస్థకు సీఈజో ఎలా అయ్యాడనేదే అసలు కథ. మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన వ్యక్తి రిషి కుమార్ ఓటమిని ఒప్పుకునే వాడు కాదు. తండ్రి అప్పుడు చేసి అవమానాలు పాలయ్యేవాడు. దీంతో ఎలాగైనా గొప్పవాడు కావాలని కలలు కనేవాడు. వాటిని సాకారం చేసుకునే క్రమంలో ఎంటెక్ చేస్తాడు. అక్కడే తనకు ఇద్దరు స్నేహితులు (పూజా హెగ్డే, అల్లరి నరేష్) అవుతారు. తన స్నేహితుడితో చిన్న గొడవ జరి మాట్లాడకుండానే అమెరికా వెళ్లిపోతాడు. తన లక్ష్యం కోసం ప్రేమను కూడా కాదనుకుంటాడు. అమెరికా వెళ్లిన తర్వాత తండ్రి చనిపోతాడు. తన స్నేహితుడి ఆచూకి తెలుసుకొని.. రామా పురం విలేజ్ కి వస్తాడు. తమ ఊరికోసం పోరాడుతుంటాడు. ఆ ఊరిని కాపాడేందుకు రిషి కుమార్ కూడా అక్కడే ఉంటాడు. అక్కడే ప్రాజెక్ట్ కట్టాలనుకున్న వివేక్ మిట్టల్ (జగపతి బాబు) ని ఎలా అడ్డుకున్నాడనేదే అసలు కథ. తన స్నేహితుడు చేసిన తప్పేంటి. ఆ తప్పును రిషి కుమార్ ఎలా తెలసుకున్నాడు. తనను ప్రేమించిన అమ్మాయిని ఎలా రప్పించుకున్నాడనేది అసలు కథ.

సమీక్ష
స్టార్ హీరోల సినిమాలు గతంలో ఓతరహాలోనే వెళ్లేవి. ఫార్ములా బేస్డ్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సామామాజిక నేపథ్యం ఉన్న కథల్ని కమర్షియల్ అంశాలతో ముడిపడి… సినిమాలు తీస్తున్నారు. ఈ కథ కూడా మహేష్ బాబు రిస్క్ తీసుకొనే చేశాడనిపిస్తుంది. అంతే కాదు. ఇందులో అటు అభిమానుల్ని సంతృప్తి పరుస్తూనే… ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా చేశాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి తనలోని కమర్షియల్ యాంగిల్ ను చూపిస్తూనే… ఫస్టాఫ్ లో ఎడ్యుకేషన్ ని బ్యాక్ డ్రాప్ గా.. .సెకండాఫ్ లో రైతుల్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నాడు. ఈ రెండు కాంటెపరరీ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. వాటని డీల్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. తన సినిమాకు తగ్గ కంటెంట్ ను ఎంచుకున్నాడనిపించింది. హీరోయిజం ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ఎమోషనల్ గా క్యారీ చేసుకుంటా వెళ్లారు. ఓ వైపు ఫ్రెండ్ షిప్, లవ్, ఫ్యామిలీ, సొసైటీ, రివెంజ్ ఇలా పలు షేడ్స్ ని ఒకే సినిమాలో డీల్ చేయడం చిన్న విషయం కాదు.

ఓడిపోవడం తెలియని హీరో కథను బాగా చూపించారు. చాలా సీన్స్ ప్రేరణగా నిలిచాయి. సీఈఓగా రిషిని ఇంట్రడ్యూస్ చేసిన సీన్స్ అదిరిపోయాయి. చాలా స్టైలిష్‌గా ఉంటాయి. బాగా ఖర్చు పెట్టారు. ఓ వైపు సీఈఓగా, మరో వైపు విద్యార్థిగా రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. రెండు వేరియేష‌న్స్ ని బాగా చూపించాడు మ‌హేష్‌. కాలేజీ సీన్స్ సరదాగా వెళ్తుంటాయి. స్నేహం, ప్రేమ‌లాంటి ఎమోష‌న్స్ ని క్యారీ చేసిన విధానం బాగుంది. అలాగే ఎడ్యుకేషన్ వ్యవస్థ లోపాల్ని ఎత్తి చూపాడు. మరో వైపు ముగ్గురి ఫ్రెండ్ షిప్ ను బాగా బిల్డ్ చేశారు. వంశీ పైడిప‌ల్లి. ముందు స‌న్నివేశాలు మెలోడ్రామా ప్ర‌ధానంగా సాగాయి. ఎమోషన్స్‌ని పండించాయి. ఇక సెకండాఫ్ లోనూ ఇదే తరహాలో వెళ్లాడు. కాస్త హెవీ ఎమోషన్ సీన్స్ తో నింపాడు. రైతులతో నిండి ఉన్న సీన్స్ అదిరిపోయాయి. రైతుల దీన స్థితిని బాగా చూపించాడు. అలాగే రైతుల గురించి మహేష్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. కమర్షియాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా ఈ సీన్స్ ని ప్లాన్ చేసిన విధానం బాగుంది. మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టించకుండా కథన నడపడం చాలా కష్టం. కానీ దర్శకుడు వంశీ పైడిపల్లి పగడ్భందీ సీన్స్, స్క్రీన్ ప్లేతో నడిపించి మెప్పించాడు. మహేష్ నరేష్ మధ్య వచ్చే సీన్స్ కావచ్చు. రైతుకు మహేష్ బాబుకు వచ్చే సీన్స్ కావచ్చు, జయసుధకు, మహేష్ బాబు మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్ గా బాగున్నాయి. యాక్టర్ గా మహేష్ బాబు తనలోని నట వైవిధ్యాన్ని చూపించాడు. మూడు షేడ్స్ ని చూపించగలిగాడు. ప్రతీ షేడ్ లోనూ కొత్తగా కనిపించాడు. గెటప్ తో పాటు నటనలోని వైవిధ్యాన్నిచూపించాడు. నరేష్ కి ప్రామినెంట్ రోల్ దక్కింది. ఈ సినిమాతో నరేష్ మళ్లీ ఫాంలోకి వచ్చినట్టు కనిపించాడు. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ను చూపించాడు.
పూజాహెగ్డేకు ఇందులో మంచి పాత్ర దక్కింది. గ్లామర్ తోపాటు… యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్ర. జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి స్టైలిష్ విల‌న్‌గా ఆక‌ట్టుకున్నారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీ పాట‌లు బాగున్నాయి. కథానుసారం వెళ్లే పాటలు అందించాడు. రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా శ్రీమణి సాహిత్యం పాటలకు అదనపు బలాన్ని ఇచ్చింది.
సినిమాని స్టైలిష్‌గా, రిచ్‌గా తీర్చిదిద్దారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకుడికి రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. అందులో మహేష్‌ సినిమా కావడంతో ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. గ్రాండియర్ గా ఉన్నాయి విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది.

ఓవరాల్ గా… మహేష్ బాబు కెరీర్లో మంచి సినిమాగా నిలిచిపోయే చిత్రం. వంశీ పైడిపల్లికి మరో సూపర్ హిట్ దక్కినట్టే… ఆయన కెరీర్ కు ఉపయోపడే సినిమా. కమర్షియల్ అంశాలతో పాటు… సామాజిక నేపథ్యం ఉన్న కథను డీల్ చేసిన విధానం బాగుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మొత్తం చూసే విధంగా తీర్చిదిద్దారు.

PB Rating : 3.5/5