ఊటీలో సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం

సూపర్ స్టార్ మహేష్ హీరోగా పివిపి సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రహ్మోత్సవం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలియజేస్తూ…ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ జరిగాయి. ఈనెల 28 నుంచి మూడో షెడ్యూల్ ను రామోజీ ఫిల్మి సిటీలో స్టార్ట్ చేస్తున్నాం. డిసెంబర్ 9 వరకు హైదరాబాద్ లో షూట్ చేసి ఊటీ షిఫ్ట్ అయి డిసెంబర్ 10నుంచి నెలాఖరు వరకు ఊటీలో షెఢ్యూల్ చేస్తాం. ఊటీలో చిత్రంలోని నటీనటులందరూ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించడం జరుగుతుంది. అని అన్నారు.

పి.వి.పి. సినిమా అధినేత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ… ఒక అద్భుతమైన కథతో, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సూపర్ స్టార్ కెరీర్ కి మా బేనర్ కి ఇది ఒక ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.