ఎండల్లో తిరగలేనంటున్న మహేష్ బాబు

ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈసారి స్టార్ క్యాంపెయినింగ్ హడావిడి ఎక్కువగా ఉంది. పోటీ చేసే వాళ్లు పెరిగారు ప్రచారం చేసేవాళ్లూ పెరిగారు. కానీ ఏది ఏమైనా మహేష్ బాబు తొలిసారిగా రాజకీయాల గురించి మాట్లాడటం మాత్రం హైలైట్ గా నలిచింది.

తాను రాజకీయాలకు దూరమంటూనే తన బావ గల్లా జయదేవ్ ని సపోర్ట్ చేస్తూ చాంతాడంత లెటర్ ను ట్విట్టర్లో పడేశాడు ప్రిన్స్. ఇది చూసి చాలామంది షాక్ అయ్యారు. రాజకీయాలు వద్దన్నా జయదేవ్ వినలేదని… అయితే అది తన ఇష్టమని చెబుతూనే… తాను మాత్రం పాలిటిక్స్ కి దూరమన్నాడు. అలాగే తాను పార్టీకి కాకుండా మా బావను మాత్రమే సపోర్ట్ చేస్తానని ఎందుకంటే ఆయన బాగా కష్టపడతాడని చెప్పుకొచ్చాడు. 

అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇంతకూ బావ కోసం ఎండల్లో ఎన్నికల ప్రచారం చేస్తాడా అనే సందేహాలున్నాయి చాలామందిలో. ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం మహేష్ ఎన్నికల్లో ప్రచారం మాత్రంచేయనని చెప్పేశాడట.

అందుకే ట్విట్టర్లో అంత పెద్ద పోస్ట్ పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడట. అసలే ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు సినిమా షెడ్యూల్ తో బిజీగా ఉన్నాడు. సో… మహేష్ ప్రచారం లేనట్టే.