ట్విట్ట‌ర్‌లో సూప‌ర్‌స్టార్ ఫాలోయ‌ర్స్ అర‌కోటి..!

ట్విట‌ర్‌లో టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఫాలోయ‌ర్స్ సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. తాజాగా ప్రిన్స్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 5 మిలియ‌న్లు అంంటే అక్ష‌రాలా అరకోటి దాటింద‌ట‌. తెలుగులో ఈ అరుదైన రికార్డు ప్ర‌స్తుతానికి మ‌హేష్‌కు మాత్ర‌మే సొంత‌మట‌. వాస్త‌వానికి మ‌హేష్‌  సోషల్‌మీడియాలో చాలా తక్కువగా స్పందిస్తుంటార‌న్న విష‌యం తెలిసిందే..! కొన్నిప్రత్యేక సందర్భాల్లోను, తన సినిమా ప్రచార చిత్రాల విడుదల సమయంలోను, త‌న మ‌న‌సుకు న‌చ్చిన అంశాల్లోను కాస్త అరుదుగానే ట్వీట్లు చేస్తుంటారు. అయినా సరే ఆయనకు మాత్రం ట్విటర్‌లో క్రేజ్ అంత‌కంత‌కూ పెరిగిపోతుండ‌టాన్ని ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి.  ఏప్రిల్‌ 2010లో మహేశ్‌ ట్విటర్‌ ఖాతాను ప్రారంభించారు.

               ఇంత‌కీ మ‌హేష్‌ను ఇంత‌మంది  మహేశ్‌ను ట్విటర్ లో ఇంత‌మంది అనుస‌రిస్తుండ‌గా మ‌రి మ‌హేష్ ఎవ‌రిని ఫాలో అవుతున్నారో తెలుసా..? ఒకే ఒక్క వ్య‌క్తిని.. ఆయ‌న ఎవ‌రో కాదు… మ‌హేష్ ఎంత‌గానో అభిమానించే త‌న బావ గల్లా జ‌య‌దేవ్‌ను. కాగా మ‌హేష్‌ ఫాలోవర్స్‌ సంఖ్య తాజాగా 50 లక్ష‌ల‌కు చేరుకున్న‌సందర్భంగా ఆయన సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించారు. ఇంతటి ప్రేమాభిమానాలు చూపుతున్న అభిమానులకు ఆమె హృదయపూర్వ‌కంగా ధన్యవాదాలు తెలియ‌జేస్తూ… మహేశ్‌తో కూడిన ఓ ఫొటోను    షేర్ చేశారు.