ప‌వ‌న్ మ‌ర‌ద‌లిపై క‌న్నేసిన మ‌హేష్‌బాబు..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది సినిమాలో అమ్మో.. బాపుగారి బొమ్మో.. అంటూ ప‌వ‌న్ చేత పొగిడించుకొన్న మ‌ర‌ద‌లుపిల్ల‌ ప్ర‌ణీత‌. ప‌వ‌న్ ప్ర‌ణీత‌ను ల‌వ్ చేస్తే ప‌వ‌న్‌కు హ్యండ్ ఇచ్చిన ప్ర‌ణీతకు ఆ సినిమా హిట్ అయినా త‌ర్వాత తెలుగులో స‌రైన బ్రేక్ రాలేదు. అయితే ఆ సినిమా హిట్ త‌ర్వాత చాలా రోజుల‌కు ప్ర‌ణీత‌కు ఇప్ప‌డు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. 

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న డైన‌మైట్‌లో హీరోయిన్‌గా న‌టిస్తున్న ప్ర‌ణీతకు తాజాగా మ‌రో బంఫ‌ర్ ఛాన్స్ వ‌చ్చింది. మ‌హేష్ బాబు శ్రీ‌కాంత్ అడ్డాల కాంబినేష‌న్లో బ్ర‌హ్మోత్స‌వం ఇటీవ‌లే మొద‌లైంది. ఈసినిమాలో క‌థానాయిక‌గా ర‌కుల్‌ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. రెండో హీరోయిన్‌గా ప్ర‌ణీత పేరు ఖ‌రారైంది. మ‌హేష్ సినిమాలో ఆఫ‌ర్ రావ‌డంతో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అయినా స‌రే ప్ర‌ణీత ఎగిరి గంతేసి మ‌హేష్ స‌ర‌స‌న రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. 

అత్తారింటికి దారేది సినిమాలో ప‌వ‌న్‌కు మ‌ర‌ద‌లి పిల్ల‌గా క్యూట్ లుక్స్‌తో ఆక‌ట్టుకున్న ప్ర‌ణీత మ‌హేష్ స‌ర‌స‌న ఏ రేంజ్‌లో రొమాన్స్ చేస్తుందో చూడాలి.