మ‌హ్రీన్ మ‌నోళ్ల‌ను మాయ చేస్తుందా..?

మహ్రీన్ కౌర్ ఫిర్జ‌దా.. ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు ఇది. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథతో ప‌రిచ‌య‌మవుతుంది ఈ బ్యూటీ. తొలి సినిమాలోనే నాని లాంటి టాలెంటెడ్ హీరోతో న‌టించే అవ‌కాశం అందుకుంది మ‌హ్రీన్. దాదాపు 30 యాడ్స్ లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు హ‌ను రాఘ‌వ‌పూడి క‌ళ్ల‌లో ప‌డి హీరోయిన్ అయిపోయింది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్స్ లో మ‌హ్రీన్ లుక్ కేక పెట్టిస్తుంది. ఎక్క‌డా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌క‌పోయినా.. మ‌హ్రీన్ చూపులు కుర్రాళ్ల గుండెల్ని డిస్ట‌ర్బ్ చేస్తున్నాయి.

పైగా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికి ఏ మాత్రం అభ్యంత‌రం లేదంటూ సెల‌విచ్చింది ఈ భామ. అంటే ఇప్ప‌ట్నుంచే ఇత‌ర ద‌ర్శ‌కనిర్మాత‌ల‌కు తాను గ్లామ‌ర్ రోల్స్ కు సిద్ధ‌మంటూ సిగ్న‌ల్ ఇచ్చేస్తుంది మ‌హ్రీన్. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌లో మ‌హాల‌క్ష్మిగా న‌టిస్తున్న మ‌హ్రీన్.. ఆ సినిమాతో క‌చ్చితంగా హిట్ కొడ‌తాన‌నే ధీమాతో ఉంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి.. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ వీర విజ‌యం సాధించిందంటే తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రో టాలెంటెడ్ యాక్ట్రెస్ దొరికేసిన‌ట్లే. అస‌లే ఇప్పుడు మ‌న కుర్ర హీరోలంతా కొత్త‌మ్మాయిల కోసం క‌ళ్ళ‌లో ఒత్తులేసుకుని మ‌రీ కూర్చున్నారు.