మజిలీ మూవీ రివ్యూ

పెళ్లి త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, స‌మంత అక్కినేని జంట‌గా న‌టించిన స్తున్న చిత్రం `మ‌జిలీ`. షైన్ స్కీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. నిన్ను కోరి వంటి హిట్ చిత్రం అందించిన శివ నిర్వాణ దర్శకుడు కావడం… లీడ్ పెయిర్ కు ఉన్న క్రేజ్ తో ఈ సినిమాకు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది. క్లాస్ మూవీగా కనిపించిన ఈ చిత్రం ట్రైలర్… ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే….
వైజాగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌జిలీ ఓ ఎమోష‌న‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. పూర్ణ (నాగచైతన్య) మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. తల్లి ఉండదు. తండ్రి (రావ్ రమేష్) రైల్వేలో ఉద్యోగి. పూర్ణకు క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం. అలా మెల్లగా క్రికెట్ టీంలోకి ఎంటర్ అవుతాడు. కానీ అక్కడ జరిగే లోకల్ గొడవల్లో ఇరుక్కుంటాడు. అలాగే… నేవీ కుటుంబానికి చెందిన అన్షు (దివ్యాంక)ని చూసి ప్రేమిస్తాడు. అన్షు కూడా పూర్ణను ఇష్టపడుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ అన్షు ఫ్యామిలీ పూర్ణకు దూరం చేస్తుంది. దీంతో అనుకోని పరిస్తితుల్లో శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకుంటాడు. కాని వీరిద్దరు భార్యా భర్తలుగా ఉండలేకపోతారు. పూర్ణ అన్షుని మర్చిపోలేకపోతాడు. ఓ వైపు క్రికెట్ వదిలేస్తాడు. ఫ్యామిలీని పట్టించుకోడు. ఈ దశలో తన జీవితంలోకి మీరా ఎంటర్ అవుతుంది. మీరా వచ్చిన తర్వాత పూర్ణ లైఫ్ ఎలా మారింది. మీరా ఎవరు. మీరాకు పూర్ణ కు ఏంటి సంబంధం. శ్రావణిని అన్షు పట్టించుకున్నాడా లేదా ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష
ఈ సినిమా పూర్తిగా ఎమోషన్స్ తో కూడుకున్న చిత్రం. నాగచైతన్య యంగ్ ఏజ్ లవ్ స్టోరీ, క్రికెట్ నేపథ్యంలో చిత్ర కథ ప్రారంభమౌతుంది. క్రికెట్ లో లోకల్ గా జరిగే రాజకీయాల్ని, గొడవల్ని దర్శకుడు బాగా చూపించాడు. మరో వైపు హీరో హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీనీ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. దీంతో పాటు క్రికెట్ పాలిటిక్స్ ని, రైల్వేలో జరిగే జాబ్స్ దందాను చూపించాడు. ఇంకో వైపు నేవీ ఫ్యామిలీని, రైల్వే ఫ్యామిలీ ఎమోషన్స్ ని, బిహేవియర్ ను చూపించాడు. ఇంటర్వెల్ బ్లాక్ కి ముందు సమంతను ఎంటర్ చేసి కథకు కొత్త మలుపు ఇచ్చాడు దర్శకుడు. సమంత క్యారెక్టర్ కు ముందు వచ్చే స్క్రీన్ ప్లే టఫ్ గా ఉంటుంది. తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయగలిగాడు దర్శకుడు. సమంత ఎంటర్ అయిన తర్వాతే ఈ విషయం మనకు అర్థమౌతుంది. ఇంటర్వెల్ తర్వాత కథా గమనం మారిపోతుంది. సినిమా టింజ్ మారిపోతుంది. సినిమా ఎమోషన్ మారిపోతుంది. సమంత లవ్ స్టోరీని ఫస్టాఫ్ లోని సీన్స్ కి లింకప్ చేసిన విధానం బాగుంది. సమంత నాగచైతన్య, రావ్ రమేష్ మధ్య వచ్చే సీన్స్ అటు ఎమోషన్ తోపాటు కామెడీ కూడా పండించింది. సమంత ఫాదర్ గా పోసాని కామెడీ బాగుంది. పోసాని రావ్ రమేష్ సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. నాగచైతన్య ఇటు లవర్ గా, అటు భర్తగా రెండు క్యారెక్టర్స్ ని బాగా క్యారీ చేశాడు. మరో వైపు సమంత తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సెకండాఫ్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. వీరిద్దరి మధ్య ప్రేమ కథను డిఫరెంట్ గా డీల్ చేశాడు దర్శకుడు. హెవీ ఎమోషన్స్ తో కూడుకున్న సినిమా ఇది. ఇంతటి ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ కథ డీవియేట్ కాకుండా చూసుకున్నారు.

సెకండాఫ్ లో మీరా క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా సరదాగా మారింది. భార్యా భర్త మధ్య ప్రేమ చిగురించేందుకు రాసుకున్న సీన్స్ బాగున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ స్లో పేజ్ నరేషన్ ఎంచుకున్నాడు. మాస్ ఆడియెన్స్ సంగతి పక్కన పెడితే క్లాస్ ఆడియెన్స్ పూర్తిగా లీనమై చూసే విధంగా చిత్రీకరించాడు. భారీగా ఉండే భావోద్వేగాలు ఎంతమందిని మెప్పిస్తాయనేది చూడాలి. దర్శకుడు ఎంచుకున్న క్యాస్టింగ్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సుబ్బరాజు కీలక పాత్రలో కనిపించాడు. పాటలు ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్స్ స్టోరీని డ్రైవ్ చేశాయి. క్రికెట్ ని మాత్రమే ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయకుండా… ఎమోషన్స్ యాడ్ చేశాడు. దీంతో రెగ్యులర్ సినిమా చూసిన ఫీలింగ్ కనిపించదు. అక్కడక్కడ తమిళ ఫ్లేవర్ కనిపిస్తుంది. టెక్నికల్ గా మ్యూజిక్, కెమెరా, డైలాగ్స్ సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లాయి. నిర్మాణాత్మకంగా క్వాలిటీగా ఉంది.

సమంత పాత్రతో భర్తపై భార్యకు ఉండే ప్రేమను ఎస్టాబ్లిష్ చేశాడు. సమంత, నాగచైతన్య స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. వీరిద్దరి కెమిస్ట్రీతో కథకు కనెక్ట్ అవుతుంటాం. కథతో పాటు సెంకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఇంట్రస్టింగ్ గ ఉంటాయి. చాలా సీన్స్ ప్రెడిక్టబుల్ గాఉన్నప్పటికీ ఇంట్రస్టింగ్ గానే ఉంటాయి. ఓవరాల్ గా… హెవీ ఎమోషన్స్, హై పెర్ ఫార్మెన్స్ తో మజిలీ ప్రేక్షకుల మెప్పు పొందుతుంది.

Rating : 3.25/5