ఈ జర్నలిస్టును మనం ఆదుకోలేమా..?

జర్నలిస్టుల జీవితాలు దయానీయంగా మారుతున్నా స్పందించే ప్రభుత్వాలు కరువైపోతున్నాయి. ‘పక్షవాతం.. పస్తులు.. ఆదుకోండి’ అంటూ

ఓ జర్నలిస్టు జీవన పరిస్థితి తెరపైకి వచ్చినా.. ఆదుకోవాల్సిన వారు చూసి వదిలేయడం బాధాకరం.
ఆదుకునే హస్తం లేక తల్లడిల్లిపోతున్నాడు జర్నలిస్టు మల్కాపురం దుర్గ. నిరుపేద‌ కుటుంబం జ‌న్మించిన ఇత‌ను చాలా పేద‌రికాన్నే
అనుభ‌వించాడు. ఇత‌నికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ‌త 3 నెల‌ల క్రితం ప‌క్షవాతం వచ్చింది. ఒక వైపు కాళ్లు, చేయి
ప‌నిచేయ‌కుండా పోయాయి. అంతేకాకుండా నోటి మాట‌లు కూడా రావ‌డంలేదు. వైద్యం చేయించుకోవ‌డానికే కాదు, తినడానికి తిండి లేక
కుటుంబ సభ్యులతో ప‌స్తులు ఉంటున్నారు. త‌న భార్య ఆ ప్రాంతంలో ఇండ్లలో పాచి ప‌ని చేసి, వ‌చ్చిన చాలిచాలని సంపాద‌న‌తో జీవనం
గడుపుతున్నారు. గ‌త 12 సంవ‌త్సరాల నుంచి పలు మీడియా సంస్థల్లో వ‌ర్కింగ్ జ‌ర్నలిస్టు గా పనిచేసి.. ఎంతో మంది మ‌న్నన‌లు పొందాడు.
ప్రస్తుతం నాగోల్ లోని జైపురి కాల‌నీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న దుర్గకు కనీసంగా మందులకు మనం ఆదుకున్నా ఆయనను మనం
కాపాడుకున్నట్టే. అందుకోసం మనం తలో చేయి వేద్దాం. కనీసంగా ఓ 100 రూపాయలను విరాళంగా ఇద్దాం. అలా అందిన విరాళాలను ఆయన
భార్యకు అందిద్దాం. ..(ఈ మొయిల్ వల్ల మీకు ఇబ్బంది కలిగితే క్షమించండి..థ్యాంక్యూ )

……………………………………………………………….
జర్నలిస్టు దుర్గను ఆదుకునేందుకు స్పందిస్తున్న హృదయాలు
పక్షవాతం, పస్తులతో తల్లడిల్లిపోతున్న జర్నలిస్టు మల్కాపురం దుర్గకు చేయుత అందించేందుకు జర్నలిస్టు హృదయాలు స్పందిస్తున్నాయి.
దుర్గా జీవితంలో వెలుగు రేఖలు నింపేందుకు కనీసంగా 100 రూపాయలు సహాయం చేయాల్సింది చేసిన విజ్ఞప్తికి పలువురు జర్నలిస్టులు
స్పందించారు.

1. బి. లక్ష్మికాంతరావు (న్యూస్ కరస్పాండెంట్ – బ్రేకింగ్ న్యూస్24×7) రూ. 1000
2. దయ్యాల అశోక్ (ఫిలిం జర్నలిస్టు-6టీవీ) రూ. 500
3. స్వామి ముద్దం (బ్యూరో చీఫ్ – బ్రేకింగ్ న్యూస్24×7) రూ.500
4. పిఎస్ ఎన్ రెడ్డి (ఫిలిం జర్నలిస్టు ..భారత్ టుడే ) రూ.500
5.కె.సతీష్ (ఫిలిం జర్నలిస్టు ..నెంబర్ వన్ న్యూస్ ) రూ..500
6.రాంబాబు కడలి (ఫిలిం జర్నలిస్టు ..టాలీవుడ్ ఛానల్ ) రూ..500
7.క్రిష్ణ ప్రసాద్ .ఆర్ ( (ఫిలిం జర్నలిస్టు..6టీవీ)..500
8. అడ్ల రాంబాబు (సీనియర్ ఫిలిం జర్నలిస్టు-సినీవినోదం.కాం) రూ. 200
9. ఎ. కిషోర్ (సబ్ ఎడిటర్ – ఏబీఎన్ ఆంధ్రజ్యోతి) రూ. 200
10. చిన్నమూల రమేష్ (సీనియర్ ఫిలిం జర్నలిస్టు- జీ తెలుగు) రూ. 100
11. వీరేష్ తమ్మాలి (సబ్ ఎడిటర్ – టీవీ-5) రూ. 100
12.రాజేష్ మన్నె (ఫిలిం జర్నలిస్టు ..సినిమా రిపోర్టర్ వెబ్ ) రూ..100
తమవంతుగా స్పందించాలనుకునే మిత్రులు సంప్రదించండి. దాతల వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసేలా ఏర్పాటు చేశాం.
ఫోన్ నంబ‌ర్ 7794911799 (దుర్గా భార్య త్రివేణి)..
M.Triveni, A/C No:52209438317(SBH-Nagole), IFSC:SBHY0021056.

విరాళాలు సేకరిస్తున్న వారి కాంటాక్ట్ నంబర్ ASHOK DAYYALA -9550889907, SWAMY MUDDAM – 040 40126969