ప్ర‌భాస్ కు త‌ల్లి కాలేక‌పోయిన మంచు ల‌క్ష్మి..

మంచు ల‌క్ష్మి ఏంటి.. ప్ర‌భాస్ కు త‌ల్లి కాక‌పోవడమేంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది క‌దా అస‌లు ట్విస్ట్.. బాహుబ‌లిలో ఇప్పుడు ఏ పాత్ర‌ను తీసుకున్నా.. నేష‌న్ వైడ్ గా ఎంత పేరు వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా శివ‌గామి పాత్ర గురించి ఏం చెప్పాలి..? అస‌లు బాహుబ‌లి క‌థ పుట్టిందే ఈ పాత్ర‌ను బేస్ చేసుకుని. ఇలాంటి అద్భుత‌మైన పాత్ర కోసం ముందుగా మంచు ల‌క్ష్మినే అడిగాడు రాజ‌మౌళి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మంచు వార‌మ్మాయే చెప్పింది.

శివ‌గామి పాత్ర కోసం ముందు రాజ‌మౌళి గారు న‌న్నే అడిగారు.. కానీ నేనే ప్ర‌భాస్ ను త‌ల్లిగా చేయ‌డ‌మేంట‌ని వ‌ద్ద‌న్నాను.. ఆ త‌ర్వాతే శ్రీదేవి, టబు లాంటి వాళ్ల‌ను అడిగి చివ‌రికి ర‌మ్య‌కృష్ణ‌తో చేయించారు జ‌క్క‌న్న‌. అయితే అంద‌రికంటే ముందు ఈ పాత్ర‌లో త‌న‌ను న‌మ్మి అడిగినందుకు రాజ‌మౌళికి పెద్ద థ్యాంక్స్.. అయితే శివ‌గామి పాత్ర చేయ‌నందుకు తానేమీ బాధ ప‌డ‌టం లేదంటోంది మంచు ల‌క్ష్మి. ఒక్క‌సారి ఊహించుకోండి.. మంచు ల‌క్ష్మి శివ‌గామిగా అలా న‌డిచొస్తుంటే.. ప్ర‌భాస్ ఆమెను అమ్మ అని పిలుస్తుంటే.. రానా మ‌రో వైపు నుంచి అమ్మ అంటుంటే.. అబ్బో ఆ ఊహే అద్భుతంగా ఉంది క‌దూ..! ఏం చేస్తాం చెప్పండి మ‌రీ.. మంచు ల‌క్ష్మిని శివ‌గామిగా చూసే అదృష్టాన్ని భార‌తీయులు కోల్పోయారంతే..!