తాగుబోతు తిరుగుబోతునంటున్న మంచు లక్ష్మి

ఎనిమిది కథలతో రూపొందించిన చిత్రం చందమామ కథలు. ప్రవీణ్ సత్తారు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ కీలక పాత్రలో కనిపిస్తోంది. ఇందులో ఆమె మోడల్ గా నటించింది. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. నేను ఇందులో మోడల్ గా నటిస్తున్నాను. నాతో బూతులు తిట్టించారు. సిగెరెట్లు తాగిపించారు. మందు కొట్టించారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఫ్యాషన్ సినిమాను ఇనిస్పిరేషన్ గా తీసుకున్నాను. సిగరెట్ తాగడం ఎంత కష్టమో అర్థం కావట్లేదు. నాకు చాలా కష్టమైంది. సినిమాలో నాకు జోడీ ఎవరనేది సినిమా చూస్తే గానీ అర్థం కాదు. డాడీ ఇంకా సినిమా చూడలేదు… చూస్తే ఏమీ అనరనుకుంటున్నాను. అని అన్నారు.