మంచు ల‌క్ష్మి.. ఏంటో ఈ తిక్క‌..

గబ్బ‌ర్ సింగ్ కు కొంచెం తిక్కుంది అందుకే ఆయ‌న ట్రెండ్ ఫాలో అవ్వ‌డు.. సెట్ చేస్తాడు. ఇక్క‌డ మంచు ల‌క్ష్మికి కూడా కాస్త తిక్కుంది అందుకే ఈమె కూడా ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇప్ప‌టికే న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు ల‌క్ష్మి. పైగా బుల్లితెర‌పై ఈమె వ‌చ్చీరాని తెలుగు చూసి ప్రేక్ష‌కులు కూడా బాగానే క‌నెక్ట‌య్యారు. ప్రేమ‌తో మీ ల‌క్ష్మి, ల‌క్ష్మీ టాక్ షో, బూమ్ బూమ్ లాంటి టీవీ షోస్ తో ఇప్ప‌టికే చిన్నితెర‌పై బాగానే ఫేమ‌స్ అయింది ల‌క్ష్మి.

ఈ షోస్ చాలవ‌న్న‌ట్లు ఇప్పుడు మ‌రో షోతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తుంది మంచు ల‌క్ష్మి. దీనికి మేముసైతం అనే టైటిల్ పెట్టుకుంది ల‌క్ష్మి. ఇక్క‌డ్నుంచే అమ్మాయిగారి క్రియేటివిటీ బ‌య‌టికి వ‌చ్చింది. అంద‌రిలా ప్ర‌మోష‌న్ చేస్తే త‌న షో గొప్ప‌త‌నం ఏంటి అనుకుందో ఏమో గానీ ఏకంగా స్టార్ హీరోయిన్ తో కూర‌గాయ‌లు అమ్మించింది. ర‌కుల్ ప్రీత్ నిన్న కేపీహెచ్ బీ కాల‌నీలో వెజిటిబుల్స్ అమ్మింది. ఇదంతా ల‌క్ష్మీ మేముసైతం షో కోస‌మే. సోష‌ల్ కాజ్ తోనే ర‌కుల్ తో కూర‌గాయ‌లు అమ్మించింది ల‌క్ష్మి. ఇది చూసి కొంద‌రు వాట్ ఏ క్రియేటివిటీ అనుకుంటే.. మ‌రికొంద‌రు మాత్రం మంచు ల‌క్ష్మికి తెలిలితేట‌లు మ‌రీ పెరిగిపోయాయి అంటూ సెటైర్ వేసుకున్నారు.