ఇద్దరు హీరోయిన్లతో మనోజ్ ….

ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ గతేడాది కరెంట్ తీగతో మరో హిట్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మాతగా ఓ చిత్రం తెరకెక్కనుంది. కరెంట్ తీగ తో హిట్ కొట్టిన మంచు మనోజ్, జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో ఈ సినిమా రూపొందనుండటం విశేషం.

యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. డిఫరెంట్ కామెడీ కాన్సెప్ట్ తో సాగే ఈ చిత్రంలో మనోజ్ ఎనర్జీ లెవల్స్ కి తగిన విధంగా యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో మనోజ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని వారి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ప్రొడక్షన్ హౌస్ తెలియజేసింది.