మనోజ్ మ్యారేజీకి రజనీ కాంత్ డాన్స్.. అదిరింది

మంచు కుర్రాడు మనోజ్ పెళ్లికి గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.టాలీవుడ్ లో ఎవరూ చేయనంత ఘనంగా పెళ్లి చేయాలని ఫిక్స్ అయిన ఫ్యామిలీ మెంబర్స్.. 5 రోజుల పాటు ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి పనుల్లో బిజీగా మారిపోయారు. మే 20 న హైటెక్స్ లో అంగరంగవైభవంగా జరగబోతున్నపరిణయ కార్యక్రమానికి.. ఇటీవలే కుటుంబమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించారు.

పెళ్లి పనుల గురించి పక్కనబెడితే సంగీత్ వేడుకలో అనేక సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. తారాలోకమంతా తరలిరాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ స్పెషల్ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అది సంగీత్ లో కొన్ని తెలుగు పాటలకు సూపర్ స్టార్ రజినీకాంత్ స్టెప్పులు వేయబోతున్నారన్న సమాచారం. రజినీ కాంత్ తో పాటు కన్నడ నటుడు అంబరీష్ కూడా ఈ వేడుకలో పాలుపంచుకుంటారని టాక్.

మాటల్లో చెప్పుకుంటే నే ఇంత భారీగా ఉంది.. మరి రియల్ గా మారేజీ ఎంత గ్రాండ్ గా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో.