మను మూవీ రివ్యూ

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం మను. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. క్రౌడ్ ఫండెండ్ ఫిల్మ్స్ లో ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ రూపొందించిన ఫణీంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్ర టీం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం.

కథేంటంటే…
మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. ఓ వజ్రాల వ్యాపారి తన ఉద్యోగికి ఓ ఉంగరం ఇస్తాడు. ఉంగరం కోసం అమర్, అక్బర్, ఆంటోని ఉద్యోగిని చంపేస్తారు. ఓ దొంగ వల్ల ఇద్దరి ప్రేమికుల జీవితాల్లో పెను మర్పులు ఏర్పడతాయి. అనేక పరిణామాలు ఎదుర్కొంటారు. ఇంతకూ ఆ దొంగ ఎవరు. ప్రేమికులు ఎవరు ఎలా కలిశారు. ప్రేమికులకు దొంగకు ఏంటి సంబంధం. వజ్రం ఏమయ్యింది. అనే ఇంట్రస్టింగ్ విషయాలు తెలియాలంటే మాత్రం మను సినిమా చూడాల్సిందే.

సమీక్ష
ఆ తరహా కథ, కథనం తెలుగు చిత్ర సీమకు కొత్తగా ఉంటుంది. ఫణీంద్ర విభిన్నమైన కథ, కథనం రాసుకున్నారు. లవ్, థ్రిల్లర్, హార్రర్ తరహాలో సాగుతుంది. అన్ని ఎలిమెంట్స్ ని టచ్ చేసుకుంటూ వెళ్లాడు. స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు అంతుబట్టకుండా సాగుతుంది. హాలీవుడ్ సినిమాల్లో ఈ తరహా స్క్రీన్ ప్లే చూస్తుంటాం. ఇది పలానా జోనర్ ఫిల్మ్ అని చెప్పలేం. ఎందుకంటే దాదాపుగా ప్రేక్షకుల్ని అత్యధికంగా ఎంటర్ టైన్ చేసే పలు జోనర్స్ ని టచ్ చేసుకుంటూ వెళ్లాడు. నిజంగా ఈ తరహా మేకింగ్, టేకింగ్ సాహసమే అని చెప్పాలి. అందులో దర్శకుడు ఫణీంద్ర సక్సెస్ కాగలిగాడు. కొన్నిచోట్ల పోయెటిక్ వేలో చెప్పాడు దర్శకుడు. సెకండాఫ్ లో మొదలయ్యే ప్రేమ కథ బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. పోయెటిక్ లవ్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే లో దర్శకుడు క్లారిటీగా ఉండడంతో ప్రేక్షకులకు కథ ఈజీగా అర్థమౌతుంది. తర్వాత వచ్చే సీన్ ఏంటనేది గెస్ చేయడం చాలా కష్టం. ఎలుకల థియరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.

హీరో రాజా గౌతమ్ కొత్తగా కనిపించాడు. ఇప్పటివరకు ఈ తరహా పాత్ర రాలేదు కాబట్టి మరింత కొత్తగా అనిపిస్తుంది. గెడ్డం లుక్ కూడా ప్లస్ అయ్యింది. తన వాయిస్ తనకు బాగా ప్లస్ పాయింట్. డిఫరెంట్ అటెంప్ట్ చేసిన దర్శకుడికి గౌతమ్ బాగా హెల్పయ్యాడు. హీరోయిన్ చాందిని చౌదరికి కూడా కొత్త పాత్రే. విభిన్నమైన పాత్రలో ఒదిగిపోయింది. హీరో హీరోయిన్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. చాందినికి ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. మిగిలిన ఆర్టిస్టులు సైతం సినిమాకు బాగా హెల్పయ్యారు. టెక్నికల్ గా మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్ బాగా హెల్పయ్యాయి. డైలాగ్స్ బాగా రాశారు. నిర్మతాలు క్వాలిటీ సినిమా అందించారు.

మోడ్రన్ థాట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు చిత్ర సీమకు కొత్త సినిమానే. కొత్త సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు. న్యూ ఏజ్ డ్రామా ఫిల్మ్ అందరికీ నచ్చేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. లవ్ , థ్రిల్, హార్రర్, సస్పెన్స్ మిక్స్ చేసిన కాబట్టి అందరికీ నచ్చే అవకాశం ఉంటుంది.

PB Rating : 3/5