రెడీ ఫర్ రిలీజ్ – ధనుష్ మరియన్ స్పెషాలిటీ ఇదే – ఎస్వీఆర్ మీడియా శోభ

ధనుష్ చిత్రాలకు తమిళంతో పాటు తెలుగులో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు భారీగా కలెక్షన్స్ వస్తాయి. దీంతో ఆయన చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొనే తమిళంలో విజయవంతమైన మరియన్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది ఎస్వీఆర్ మీడియా. ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌, ఆస్కార్‌ ఫిలిం ప్రై. లిమిటెడ్‌ పతాకంపై భరత్‌బాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏ.ఆర్.రెహమాన్ ఈచిత్రానికి సంగీతమందించారు. అంతే కాదు. తెలుగులో ఓ పాట కూడా పాడారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మరియన్ చిత్రాన్ని జూలై 31 న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా..

నిర్మాత శోభారాణి మాట్లాడుతూ… ఒక యదార్థ సంఘటన ఆధారంగా మరియన్ చిత్రాన్ని రూపొందించారు. ఎ.ఆర్.రెహమాన్ ఓ పాట పాడటం ఈ సినిమాకు హైలైట్. ఆల్రెడీ ఆడియో సూపర్ హిట్ అయ్యింది. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశాం. క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. ధనుష్ పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అని అన్నారు.

ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని. మంచి కలెక్షన్స్ వసూలు చేసే చిత్రం అవుతుందని… విజవల్లీ వండర్స్ ఉన్న సినిమా కాబట్టి బాహుబలి తరహాలోనే ఈ సినిమా తప్పుకుండా విజయవంతమౌతుందని దర్శకుడు సముద్ర, నిర్మాత ప్రసన్న కుమార్ ఆకాంక్షించారు.