మార్షల్ మూవీ రివ్యూ

ఈ మధ్య కాలంలో మార్షల్ సినిమాకు వచ్చినంత బజ్ మరే సినిమాకు రాలేదనే చెప్పాలి. అభయ్ ఆడక ట్రైలర్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు తానే నిర్మాత కావడం విశేషం. తన ఫస్ట్ సినిమాకే భారీగా ఖర్చు పెట్టి లావిష్ గా నిర్మించాడు. ఇందులో శ్రీకాంత్ కీ రోల్‌లో కనిపించాడు. జైరాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పించిందో చూద్దాం.

కథేంటి….
సూపర్‌స్టార్ శివాజీ (శ్రీకాంత్)కి, అభయ్(అభయ్ అడక) చాలా పెద్ద ఫ్యాన్. కెరీర్ పరంగా ఒక మెడికల్ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తుంటాడు అభయ్. అతనికి అక్క(శరణ్య ప్రదీప్) అంటే ప్రాణం. అయితే, ఆమెకి పిల్లలు పుట్టరు. అందుకే ఆమె, ఆమె భర్త కలిసి కోయల్ హాస్పిటల్‌లో ఫెర్టిలిటీ చికిత్స అందుబాటులో ఉంది అని తెలిసి వెళతారు. అక్కడ చికిత్స చేయించుకుంటుండగా అభయ్ అక్క కోమాలోకి వెళ్ళిపోతుంది. అదే టైమ్‌లో అభయ్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న కంపెనీ ద్వారా అతను డిస్ట్రిబ్యూట్ చేసిన బ్యూటీ పిల్స్ వేసుకున్న వాళ్లలో ఇద్దరు చనిపోతారు. మరికొంతమంది అస్వస్థతకి గురి అవుతారు. దీనంతటికి కారణం ఒక సైంటిస్ట్ చేస్తున్న ఆపరేషన్ ‘మార్షల్’ అనే ప్రయోగం, ఆ సైంటిస్ట్ సూపర్ స్టార్ శివాజీ అని రివీల్ అవుతుంది. అసలు సినిమా హీరో సైంటిస్ట్ అవ్వడం ఏంటి?, ఆపరేషన్ ‘మార్షల్’ అనేది దేనికి సంబంధించింది?, దీన్ని అంతటిని హీరో ఎలా కనుక్కున్నాడు, ఎలా ఛేదించాడు? లాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సమీక్ష…
ఈ సినిమాకు ప్రాణం కథ. దాని ద్వారా వచ్చే ట్విస్టులు. ఇందులో అభయ్ కథను తన భుజాల మీదేసుకున్నాడు. శ్రీకాంత్ క్యారెక్టర్ మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. మంచివాడుగా కనిపించే ఒక వ్యక్తి సాఫ్ట్ క్యారెక్టర్ కలిగిన చెడ్డవాడు అని తెలిసే ట్విస్ట్ గతంలో కొన్ని సినిమాల్లో చూసాం. ఈ సినిమాలో ప్రథమార్ధం అంతా అదే ట్విస్ట్‌ని రివీల్ చెయ్యడానికి రాసుకున్నారు. అయితే ట్విస్ట్ వరకు నడిచే క్రమంలో మాత్రం ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో అభయ్ ఈనెర్జిటిక్ డాన్స్ తో ఇరగదీసాడు. హీరోయిన్ చాలా బాగుంది. నటించే స్కోప్ ఉన్న పాత్ర. పాటల్లో గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇందులో దర్శకుడు ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. స్క్రీన్ ప్లే మెయిన్ హైలైట్ అని చెప్పాలి. డైరెక్టర్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడని చెప్పాలి. డైరెక్టర్ తాను చెప్పాలనుకున్న కథని బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఇంటర్వెల్ ట్విస్ట్‌ మెయిన్ హైలైట్. ఇంటర్వెల్ తో సినిమా మరో లెవల్ కి వెళ్తుంది.  సెకండాఫ్‌లో అసలు విషయం రివీల్ చేస్తారు. రివీల్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. కథలో సన్నివేశాల్లో మంచి ఎమోషన్ ఉంది. అమ్మ గురించి చాల బాగా చెప్పారు. అమ్మ విలువ చెప్పే సాంగ్ బాగా షూట్ చేశారు. చెప్పాలనుకున్న పాయింట్ ని బాగా డెప్త్‌లో ప్రెజెంట్ చేశారు. శ్రీకాంత్ పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయి. అవి మనకు థ్రిల్ కలగజేస్తాయి. క్లిమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ చాలా బాగుంది. శ్రీకాంత్ పాత్రలోని వారియేషన్స్ మెస్మరైజ్ చేస్తాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ ని బాగా కన్విన్సింగ్ గా చెప్పగలిగాడు.

సినిమాలో శ్రీకాంత్ నటన, గెటప్ ఆకట్టుకుంటుంది. స్టైలింగ్ నుండి లుక్ వరకు చాలా కేర్ తీసుకున్నారు. అయితే శ్రీకాంత్‌ని ఎదిరించే హీరో పాత్రలో అభయ్ బాగా సెట్ అయ్యాడు. తన ఎంట్రీకి మంచి కథ రెడీ చేసుకున్న అభయ్ దానికి తగ్గట్టే పెరఫామ్ చేసాడు.  డ్యాన్సులు ఫైట్స్ తో ఇరగదీసాడు. సినిమా చివర్లో వచ్చే యాక్షన్ పార్ట్ కోసం బాగా కష్టపడ్డాడు. ఈ సినిమాలో వచ్చే మేజర్ సీన్ ఇది. సినిమాలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళ పాత్రలకు కూడా మంచి వెయిట్ ఉంది. అక్కగా శరణ్యకు మంచి పేరు తీసుకొచ్చే పాత్ర లో నటించింది.

హీరోయిన్‌గా పరిచయమైన మేఘా చౌదరికి పెర్ఫార్మెన్స్ చెయ్యడానికి స్కోప్ ఉన్న పాత్ర.  సుమన్, ప్రగతి, పృథ్వి, ప్రియదర్శిని రామ్, రవి‌ప్రకాష్ లాంటి సీనియర్ నటీనటులకు మంచి పాత్రలు దక్కాయి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉపయోగించి వాటిని బాగా పోషించారు. సుదర్శన్ బాగా నవ్వించారు. ‘మార్షల్’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన జైరాజ్ సింగ్ ఎంచుకున్న పాయింట్ మీద చాలా వర్క్ చేశాడని చెప్పాలి. సరోగసీ విధానంలో బిడ్డలను కనడం, ఆ నేపథ్యంలో రాసుకున్న సీన్స్ ఆసక్తి రేకెత్తిస్తాయి. హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్, శ్రీకాంత్ చెడ్డవాడి నుండి మంచివాడిగా మారే కీలకమైన సీన్స్ బాగా డిజైన్ చేశాడు. ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ప్రతి లాజిక్ కి రీసన్స్ చెప్పగలిగాడు.  కథలో క్లారిటీ మిస్ అవ్వలేదు. మొదటిసారి డైరెక్షన్ చేసినా
చాలా బాగా డీల్ చేశాడు.

ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచమైన పాటల రచయిత వరికుప్పల యాదగిరి మంచి ఊపు ఉన్న పాటలు అందించాడు. అన్ని పాటలకు మంచి పేరొస్తుంది. ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. చోట కె నాయుడు షార్ప్ ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. ఒక కొత్త పాయింట్‌ని ఎఫెక్టివ్‌గా చెప్పాలని ‘మార్షల్’ టీమ్ చేసిన ప్రయోగం అభినందించదగ్గదే. కథని నమ్ముకుని ధైర్యంగా చాలా ఖర్చు పెట్టారు.

ఓవరాల్ గా…. మార్షల్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. అభయ్ , శ్రీకాంత్ నటన స్క్రీన్ ప్లే, ఎమోషనల్ సీన్స్, డైరెక్షన్ మ్యాజిక్, విభిన్నమైన సీన్స్ సినిమాను నిలబెట్టాయి. మంచి పాయింట్ ని అన్ని వర్గాల్ని మెప్పించే విధంగా కమర్షియల్ గా చెప్పి సక్సెస్ సాధించారు. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5