మత్తువదలరా అందరికీ నచ్చుతుంది: ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి

మత్తువదలరా అందరికీ నచ్చుతుంది: ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి
కొత్తగా దర్శకతం చేయాలనుకునే వారందరికి మత్తు వదలరా చిత్రం ఓ మంచి ఉదాహరణ. నిర్మాత నమ్మి డబ్బులు పెట్టాలంటే మీ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ కలగాలి. ఈ సినిమా దర్శకుడు రితేష్‌రానా సొంతగా టీమ్ అంతా ఫామ్ చేసుకుని, నిర్మాతకు నమ్మకం కలిగించి ఈ చిత్ర దర్శకత్వ అవకాశాన్ని సంపాందించాడు. రితేష్ ఐడియా నాకు బాగా నచ్చిందిఅన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా  అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న  చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ మా కుటుంబానికి చెందిన ఇద్దరు ఈ చిత్రంతో పరిచయ కావడం ఎంతో ఎమోషన్‌గా వుంది. ఈ సినిమా చేశాను. తీపి కారం ఒకేసారి తిన్నట్ట అనిపించింది. చూస్తున్న కొద్ది సినిమా ఎంతో నచ్చేసింది. ప్రతి ఫ్రేము నన్ను ఆకట్టుకుంది. ఇక జనాలకు నచ్చాలి. సింహా,కాలభైరవకు చక్కటి భవిష్యత్తు వుంది. ఈ నెల 25న ప్రేక్షకులతో కలిసి మరోసారి ఈ సినిమా చూస్తాను. ఈ చిత్ర నిర్మాత చెర్రి ఎంతో ప్లానింగ్ వున్న వ్యక్తి. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తాడు. అందుకే చెర్రి అంటే నాకు చాలా ఇష్టం. నా యమదొంగకు నిర్మాత చెర్రినే. నా కెరీర్‌లో అతి తక్కువ సమయంలో తీసిన సినిమా ఇదే. దానికి కారణ చెర్రీ ప్లానింగే అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ మా పిల్లల్ని నేను ఎప్పుడూ తిడుతూ ఎంకరైజ్ చేస్తుంటాను. ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతుంటాను.కానీ ఇప్పుడు నా తనయులను చూస్తుంటే గర్వంగా వుంది. ఓ అబ్బాయి సంగీతం చేశాడనో, మరో అబ్బాయి నటించాడనో పుత్రోత్సహం, గర్వం కలగలేదు. బాహుబలిలో దేవసేన పరిచయ సన్నివేశానికి కాలభైరవ సంగీతం అందించాడు. హంసనావపాటలో రెండు లైన్లు పాడాడు. ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు. ఇది నేనే చేశాను అని ఎప్పుడూ చెప్పలేదు. ఆ లక్షణం నాకు నచ్చింది. ఒకసారి మా ఫ్యామిలీ  ఫంక్షన్‌లో సరదాగా ఓ క్వీజ్ కార్యక్రమం ఆడినప్పుడు కొడుకు మీద ప్రేమతో శ్రీ సింహాకు సమాధానం ముందే చెప్పాను. అయితే శ్రీసింహా మాత్రం తనకు ఆన్సర్ తెలిసినా జవాబు తప్పు చెప్పి క్రీడాస్ఫూర్తి చాటుకున్నాడు. ఆ సమయంలో తనలో నటుడు కనిపించాడు. ప్రతి ఆర్టిస్ట్‌లోనూ ఓ మంచి లక్షణం వుంటుంది. దాన్ని పట్టుకుని సాధన చేసుకోవాలని సింహాకు సలహా ఇస్తున్నాను. రితేష్ చిత్రాన్ని చక్కగా రూపొందించాడు. ఈ సినిమా అందరికి మంచి పేరు తీసుకరావాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. కాలభైరవ మాట్లాడుతూ  ఎప్పటి నుంచో సంగీత దర్శకుడిని కావాలనేది నా డ్రీమ్. ఈ సినిమాతో నా కల తీరింది. నేను నా సోదరుడు ఒకేసినిమాతో పరిచయం కావడం మ్యాజిక్‌లా అనిపిస్తుంది. రీరికార్డింగ్‌లో సినిమా చూస్తున్నప్పుడు తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పగానే నచ్చింది.  రంగస్థలం షూటింగ్‌లో బిజీగా వుండటం వల్ల ఈ సినిమా పట్టాలెక్కడం ఆలస్యమైంది. తప్పకుండా చిత్రం చూసిన వాళ్లంతా కొత్తదనంతో కూడిన థ్రిల్ల్‌ను ఫీలవుతారు అన్నారు. శ్రీసింహా మాట్లాడుతూ  అందరూ కొత్తవాళ్లం కలిసి నిర్మించిన సినిమా ఇది. మాపై నమ్మకం వుంచిన నిర్మాతకు కృతజ్ఞతలు అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ  ఈ సినిమాలో పాటలు, హీరో, హీరోయిన్స్, రొమాన్స్ లేకున్నా నిర్మాత కథ నచ్చి, కథలో ఎటువంటి మార్పు లేకుండా నిర్మించారు అన్నారు. ఈ కార్యకమంలో గుణ్ణం గంగరాజు,  నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య,  సినిమాటోగ్రఫర్ సురేష్ సారంగం, క్రియేటివ్ హెడ్: థోమస్‌జై సాహిత్యం: రాకేందుమౌళి,  లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు తదితరులు పాల్గొన్నారు.