MBM – మేరా భారత్ మహాన్ మూవీ రివ్యూ

ప్రత ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ వైద్యులు డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టి.ప‌ల్ల‌వి రెడ్డి  సంయుక్తంగా తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం  `ఎమ్‌బిఎమ్‌` (మేరా భార‌త్ మ‌హాన్‌) అఖిల్ కార్తిక్, ప్రియాంక శ‌ర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న  చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. చిన్న సినిమాల్లో ఈ మధ్య మాట్లాడుకున్న చిత్రమిది. మరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే…. మహాన్ (శ్రీధర్ రాజు) మేరా భారత్ మహాన్ – ఎంబిఎం అనే సంస్థను స్థాపించి… కార్పోరేట్ అరాచకాలపై పోరాడుతుంటాడు. యూత్ ని ఎట్రాక్ట్ చేసి వారితో తాను ఆనుకున్న ఆశయాల సాధనకు కృషి చేస్తుంటాడు. ఈ సంస్థలోని సభ్యుల్ని తనికెళ్ల భరణి మోటివేట్ చేస్తుంటాడు. ఇదే సంస్థకు పనిచేస్తుంటారు కార్తీక్ (అఖిల్ కార్తీక్), సంజిత (ప్రియాంక శర్మ). వీరిద్దరూ చిన్నప్పటి నుంచి క్లాస్ మేట్స్. ప్రేమించుకుంటారు. వీరిద్దరు కూడా చురుగ్గా ఎంబిఎం చేసే కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. ఇదే సమయంలో… ఓ బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. అది ఫెయిలౌతుంది. చాలా మంది చనిపోతారు. అలాగే మంత్రుల పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు.

ఇంతకూ బాంబ్ బ్లాస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు. ఎంబిఎం అసలు ఉద్దేశ్యం ఏంటి. కార్పోరేట్స్ అంటే మహాన్ కు ఎందుకు పడదు. వారు ఏం చెప్పాలనుకున్నారు. ఎలాంటి సమస్యల గురించి పోరాడారు. కార్తీక్, సంజిత ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది. వారు ఎంబిఎంకు ఎందుకు ఎట్రాక్ట్ అయ్యారు. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం థియేటర్లో సినిమా చూడాల్సిందే.

సమీక్ష
నటుడు శ్రీధర్ రాజు మంచి కథ రెడీ చేశారు. విభిన్నమైన పాత్రలో నటించాడు. శ్రీశ్రీని తలపించే మోటివేషనల్ డైలాగ్స్ తో మెప్పించాడు. సినిమా ప్రారంభం నుంచి ఓ టెంపోలో కథ వెళ్తుంది. చాలా అంశాల్ని టచ్ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. ఆరోగ్యశ్రీ గురించి స్ట్రైయిట్ గానే చెప్పేశారు. కార్పోరేట్ కళాశాలలు పెట్టే ఒత్తిడితో విద్యార్థులు ఎలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో కళ్లకు కట్టినట్టు చూపించారు. రైతుకు సరైన గిట్టుబాటు ధర రాక ఎలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో చూపించారు. సరైన వైద్యం అందక పేదవారు ఎలా చనిపోతున్నారో చూపించారు. సరైన ఉద్యోగం దొరక్క… కార్పోరేట్ కేటుగాళ్లు అమ్మాయిలను లోబర్చుకునే విధానం చూపించారు. ఉద్యోగాలు దొరక్క అమ్మాయిలు పక్కదారి ఎలా పడుతున్నారో చూపించారు. వీటితో పాటు యూత్ ని ఎట్రాక్ట్ చేసేందుకు మంచి లవ్ స్టోరీని కూడా డ్రైవ్ చేశారు. వీటితోపాటు.. రాజకీయ వ్యవస్థలోని లోపాలు, చట్టాల్లోని లోపాల్ని ఎత్తి చూపించారు. సమాజంలోని రుగ్మతల్ని తెరమీద చూపించారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌ద‌లించే విధంగా, ఆలోచింప‌జేసే విధంగా తెర‌కెక్కించారు. ఇందులో వికాసంతో పాటు యువ‌త‌ను ఆక‌ట్టుకునే వినోదం కూడా బావుంది.

చిత్ర నిర్మాత‌, క‌థా ర‌చ‌యిత‌, న‌టుడు నిర్మాత డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర తన పాత్రకుపూర్తి న్యాయం చేశారు. ఖర్చుకు వెనకాడలేదు. గ్రాండియర్ గా నిర్మించారు. మంచి కంటెంట్ ఎంచుకున్నారు. హీరో అఖిల్ కార్తీక్ క్యారెక్టర్ బాగుంది. పూర్తి న్యాయం చేశాడు. ప్రియాంక హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. యాక్టివ్ యాక్టింగ్ తో మెప్పించింది. తన అందంతో కట్టిపడేసింది. తనదైన గ్లామర్ తో ఆకట్టుకుంది. గిరిబాబు, బాబుమోహన్ కామెడీ బాగుంది. సినిమాకు రిఫ్రెష్ మెంట్ గా ఉంది వీరిద్దరి కామెడీ. తనికెళ్ల భరణి ఇన్స్పిరేషనల్ స్పీచెస్ బాగున్నాయి.. ఆమని గెస్ట్ రోల్ లో కొద్దిసేపు కనిపించింది. ఇంపార్టెంట్ సాంగ్ లో వచ్చింది. ఎల్. బి. శ్రీరాం డీసెంట్ క్యారెక్టర్ చేశారు.

దర్శకుడు భరత్…. స‌మ‌కాలీన అంశాల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడించి ఓ సందేశాత్మ‌క చిత్రంగా రూపొందించాడు. ఇప్ప‌టి ప్ర‌భుత్వాలు ప్రవేశ‌పెడుతున్న ప‌థ‌కాలు, వాటిలో లోటు పాట్లు ఎత్తి చూపించాడు. చాలా విషయాల్ని ఒకే సినిమాలో మిళితం చేయడం చాలా కష్టమైన పని. కానీ దర్శకుడు బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. ఎర్రం శెట్టి సాయి డైలాగ్స్ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. సినిమా కథను బాగా డ్రైవ్ చేశాయి. ముఖ్యంగా మోటివేషనల్ డైలాగ్స్ ని బాగా రాశాడు. లలిత్ సురేష్ మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్. సినిమా కథను డిస్ట్రబ్ చేయకుండా అన్ని రకాల పాటలున్నాయి. అలాగే రీరికార్డింగ్ బాగుంది. పాటల్ని నిర్మాతలు బాగా చిత్రీకరించారు. గ్రాండ్ గా ఉన్నాయి. పెద్దాడమూర్తి సాహిత్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలైట్. తమ కెమెరాతో చాలా ప్రయోగాలు చేశాడు. తన లైటింగ్ తో మెప్పించాడు. మేనగ శ్రీను ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. విజయ్ ఫైట్స్ బాగా కంపోజ్ చేశాడు. పెద్ద సినిమాను తలపించేలా కంపోజ్ చేసాడు. బురదలో ఫైట్ బాగుంది. కొరియోగ్రాఫ‌ర్స్ స్వ‌ర్ణ‌, దిలీప్‌, స్టెప్స్ బాగా కంపోజ్ చేసారు.

ఫైనల్ గా….. సామాన్యుల‌కు విద్య , వైద్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే స‌మాజం బాగుంటుంద‌నే సామాజిక స్పృహ తో పాటు, లవ్, కామెడీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం మేరా భారత్ మహాన్. సో గో అండ్ వాచిట్
PB Rating : 3/5