ప్రెస్‌క్ల‌బ్‌లో మంత్రి జూప‌ల్లి..అడ్ర‌స్ లేని టీడీపీ నేత‌లు

తెలంగాణ టీడీపీ నేత‌ల‌కు ద‌మ్ములేద‌ని, అందుకే తోక‌ముడిచార‌ని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిప‌డ్డారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాలంటూ స‌వాల్ విసిరి, అందులో భాగంగా సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌కు నిర్ణీత స‌మ‌యానికే చేరుకున్నారు జూప‌ల్లి. టీడీపీ నేతలు కోసం గంట సేపు నిరీక్షించి ఆఖ‌రికి వారు రార‌ని నిర్థారించుకుని మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు త‌న తొమ్మిదేళ్ల పాల‌న‌లో పాల‌మూరుకు క‌నీసం ప‌దికోట్ల రూపాయ‌లు కూడా వెచ్చించ‌లేద‌ని ఆరోపించారు.

టీ టీడీపీ నేతలు దిగజారి బతుకుతున్నార‌ని, వాస్తవాలు బయటపడుతాయనే వారు తప్పించుకు తిరుగుతున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పాలమూరు ఎత్తిపోతలకు టీడీపీ అడ్డు కాదని చంద్రబాబుతో లేఖ రాయించండని కౌంట‌ర్ పాస్ చేశారు.త‌మ ప్ర‌భుత్వం నేతృత్వంలో పాలమూరు ఎత్తిపోతల ప‌థ‌కాన్ని కట్టితీరుతామని స్పష్టం చేశారు.