కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న ల‌వ్‌స్టోరీ `మిస్ మ్యాచ్‌` రివ్యూ

‘ఆటగదరా శివ’ లాంటి డీసెంట్‌ హిట్‌ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్నారు యంగ్‌ హీరో ఉదయ్‌ శంకర్‌. ఇప్పుడు మిస్ మ్యాచ్ సినిమాతో మనముందుకు వచ్చారు. ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్. అధిరోహ్‌ క్రియేటివ్‌ సైన్స్‌ ఎల్‌.ఎల్‌.పి బేనర్‌ పై జి.శ్రీరామ్‌ రాజు, భరత్‌రామ్‌ నిర్మించారు.  డా.సలీమ్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్‌.వి. నిర్మల్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ తో మంచి బజ్ క్రీయేట్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మ్యాచ్ చేసిందో చూద్దాం.

కథేంటంటే…. గోవంద రాజు (ప్రదీప్ రావత్) ఊర్లో మంచి మల్ల యోధుడు. చాలా మందికి ట్రైనింగ్ ఇస్తుంటాడు. అలాగే తన కూతురు మహా లక్ష్మి (ఐశర్య రాజేష్) కి కూడా ట్రైనింగ్ ఇస్తాడు. పలు పోటీల్లో విజయం సాధిస్తుంది. మరో వైపు సిద్దార్థ (ఉదయ్ శంకర్) మెమోరీ పవర్ లో మంచి టాలెంట్ ఉంటుంది. వీరిద్దరూ యూత్ ఫస్ట్ బస్ లో కలుస్తారు. అక్కడ సుద్దు టాలెంట్ చూసి మహా ఇష్టపడి ప్రేమిస్తుంది. ఆమె ప్రేమను తెలియ జేస్తుంది. ఐతే తనతో మ్యాచ్ అవ్వనని ప్రేమను ఒప్పుకోడు. ఇదే సమయలో ఊర్లో ఒక ఫ్యాక్టరీ విషయంలో గొడవలో మహా తండ్రి జైల్ కి వెళ్తాడు. అప్పుడు సిద్దూ మహా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాడు. మహా తో పాటు కాంపిటీషన్ కి వెళ్తాడు … ఇంతకు సిద్దు మహాను ప్రేమిస్తున్నాడా లేదా. మహా సిద్దూ ఫ్యామిలీస్ దగ్గరయ్యారా లేదా ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష
అది రెగ్యులర్‌ లవ్‌ స్టోరీలా కాకుండా కంటెంట్‌ ప్రధానంగా రూపొందించినారు. ఫ్యామిలీ డ్రామా, యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. సిద్ధుగా ఉదయ్ శంకర్ నటిస్తే… ఐటీ ఉద్యోగిగా నటిస్తే, కనక మహాలక్ష్మి అలియాస్‌ మహా అనే రెజ్లర్‌గా ఐశ్వర్య రాజేశ్‌ చేసింది.

డైరెక్టర్‌గా నిర్మల్‌ కుమార్‌ కథను బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా కథను నడిపించిన విధానం చాలా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా సీన్స్ ప్లాన్ చేసుకున్నాడు. ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే సీన్ లో డైలాగ్స్ బాగా రాసుకున్నారు. రెండు ఫ్యామిలీల వార్ ని చాలా సున్నితంగా ఎమోషనల్ గా చెప్పాడు. భూపతిరాజా మంచి కథ అందించాడు. హీరో హీరోయిన్ ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉన్న కథ. ఐశ్వ‌ర్య‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, తమిళంలో స్టార్‌ అయిన ఐశ్వర్యా రాజేశ్‌ మంచి పెర్ఫార్మర్‌. ఈ క్యారెక్టర్ లో బాగా సెట్ అయ్యింది. బాగా కష్టపడింది.

‘తొలిప్రేమ’ లోని ఈ మనసే సాంగ్ ని విజయ్ మాస్టర్  సింగిల్ షాట్‌లోనే షూట్ చేశారు. ఈ సాంగ్ చాలా బాగుంది. సినిమా ప్రారంభమే దేవుడి పాటతో స్టార్ట్ చేసి మంచి ఊపు తీసుకొచ్చారు. యూత్ సమ్మిట్ కి వెళ్ళినప్పుడు హీరో హీరోయిన్  జూపించే టాలెంట్స్ చాలా బాగున్నాయి. తర్వాత బస్ అగుతుంది. హీరోయిన్ చెట్టు తొలగిస్తుంది. అందరూ వీరి టాలెంట్ ని మెచ్చుకుంటారు. బస్ పేపర్స్ తెప్పించడంలో హోటల్ లో ప్లేట్స్ తీసే సీన్ తో హీరోయిన్ హీరోతో ప్రేమలో పడుతుంది. సిద్ధార్థ్ పొల్యూషన్ గురించి కనిపెట్టే కాన్సెప్ట్ కి మంచి పేరు వస్తుంది. హీరోయిన్
శనక్కాయలు కొనే సీన్ ఎమోషనల్ గా బాగుంది. హీరోయిన్ హీరో ను ప్రపోజ్ చేసే సీన్ బాగుంది. మహా ని సిద్దు ప్రపోజ్ చేసే సీన్ కొత్తగా ఉంది. ఇంటర్వెల్ సీన్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. రెండు కుటుంబాల మధ్య జరిగే ఫైట్  ఎమోషన్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ సినిమా రూపమే మారిపోయింది. ఫ్యాక్టరీ గొడవలు హీరో ఎంట్రీ … హీరోయిన్ హీరోతో కలిసి ట్రావెల్లింగ్ సీన్స్ చాలా బాగా కంపోజ్ చేసాడు డైరెక్టర్. 

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు మంచి పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా ప్రదీప్ మంచి ఫాదర్ గా కొత్తగా కనిపించడం బాగుంది. ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసాడు. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం ప్లస్ అయ్యింది. గణేష్ కెమెరా వర్క్ చాలా బాగుంది.

ఓవరాల్ గా… మంచి కథ కథనం తో మిస్ మ్యాచ్ రూపొందించారు. లవ్ ని గేమ్ ని బాగా మ్యాచ్ చేశారు. ఎమోషనల్ సీన్స్ ని బాగా కంపోజ్ చేశారు. ఫ్యామిలీ తో కలిసి చూడదగ్గ సినిమా మిస్ మ్యాచ్ సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5