మిస్టర్ అండ్ మిస్ మూవీ రివ్యూ

మిస్టర్ అండ్ మిస్ మూవీ రివ్యూ

ఈ మధ్య కాలంలో ఓ ట్రైలర్ , పాటల గురించి బాగా మాట్లాడుకున్నారు. అదే మిస్టర్ అండ్ మిస్. కాంటెంపరరీ స్టోరీని యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కించిన సినిమా మిస్టర్ అండ్ మిస్. అశోక్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రంలో శైలేశ్, జ్ఞానేశ్వరి మెయిన్ పెయిర్. మరి ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

స్టోరీ
ఓ కుర్రాడు అమలాపురం నుంచి హైదారాబాద్ వెళ్లి సాఫ్ట్ వేర్ జాబ్ కోసం వెతుక్కుంటుంటాడు. ఆ సందర్భంలో ఓ అమ్మాయిని చూసి ఫ్లాట్ అవుతాడు. వాళ్లిద్దరూ ప్రేమలో కూడా పడతారు. వాళ్లిద్దరూ బాగా దగ్గరవుతారు. ఇద్దరి మధ్య శారీరకంగా కూడా కలయిక జరుగుతుంది. కానీ అనుకోకుండా వారి ఫోన్స్ పోతాయి. ఇక ఆ తర్వాత ఏం జరిగింద అనేది అసలు కథ.

శైలేశ్ సన్నీ లీడ్ యాక్డర్ గా చాలా బాగా చేశాడు. అమలాపురం యాసలో ఇరగదీశాడు. చాలా నాచురల్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. బాయ్ నెక్ట్స్ డోర్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాడు. డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. ఇక హీరోయిన్ జ్ఞానేశ్వరి ఈ సినిమాకు స్పెషల్. ఎందుకంటే యూత్ ని ఎట్రాక్ట్ చేసే ఫిజిక్ తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ చూపించింది. రొమాంటిక్ సీన్స్ లోనూ ప్రేక్షకుల్ని బాగా టెంప్ట్ చేసే విధంగా నటించింది. ఈ సినిమా తనకు మంచి ప్లస్ అవుతుంది. లీడ్ పెయిర్ శేలేష్ జ్ఞానేశ్వరి ఇద్దరూ పోటీపడి మరీ నటించారు. ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించారు. హీరోయిన్ కేవలం గ్లామర్ తో నే కాకుండా నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. హీరోకు ఫ్రెండ్ గా నటించిన పవన్ రమేష్ కూడా చాలా బాగా నటించాడు. అమలాపురం యాసలో ఇరగదీశాడు. మిగిలిన ఆర్టిస్టులు సైతం తమదైన స్టైల్లో నటించి మెప్పించారు.

ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ అనే చెప్పాలి. మంచి పాటలు సినిమాను నిలబెట్టాయి. నాగ్ మంచి మ్యూజిక్ అందించాడు. ప్రతీ పాట వినడానికి బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాలోని చాలా సన్నివేశాలకు ప్రాణం పోశాడనే చెప్పాలి. సంగీతంతో ప్రేమలో పడటం ఖాయం. సిద్దం మనోహర్ డిఓపీగా తన టాలెంట్ చూపించాడు.మంచి విజువల్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాకు మంచి బ్యూటీని తీసుకొచ్చాడు. ప్రతీ సీన్ కూడా కథకు సన్నివేశాలకు తగ్గట్టుగా చాలా సహజంగా ఉన్నాయి. లవ్ మేకింగ్ సీన్స్ ని బాగా పిక్చరైజ్ చేశాడు. నిర్మాత అశోక్ రెడ్డి ఎక్కడా తగ్గకుండా మంచి క్వాలిటీ సినిమా అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

డైరెక్టర్ అశోక్ రెడ్డి కథ మీద మంచి అవగాహనతో తీశాడు. అందుకే సన్నివేశాలు బోర్ కొట్టకుండా ఉన్నాయి. ప్రతీ సీన్ ను కూడా చాలా కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేశారు. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ మేకింగ్ సీన్స్ ని బాగా ప్లాన్ చేశాడు. ఎక్కడా వల్గారిటీ లేకుండా చేసారు. జీవితంలో జరిగే ప్రైవేట్ మూవ్ మెంట్స్ అన్నీ కూడా మనసులో ఉంచుకోవాలి…. కెమెరాల్లో కాదు అనే విషయాన్ని చెప్పాడు. సొసైటీలో జరుగుతున్న వీడియో స్కాండల్స్ మాఫియా ను బాగా చూపించాడు. ఇంటర్నెట్ లో ఇల్లీగల్ గా ప్రైవేట్ మూవ్ మెంట్స్ ని క్యాప్చర్ చేసి అప్ లోడ్ చేస్తున్నారనే విషయాన్ని చక్కగా చెప్పాడు. కేవలం మెసేజ్ ఓరియెంటెడ్ గా మాత్రమేకాకుండా ఎంటర్ టైనింగ్ గా మంచి విషయాన్ని చెప్పగలిగాడు. ప్రథమార్థం ఓ రకమైన టోన్ లో వెళ్తుంది. సెకండాఫ్ కి వచ్చే సరికి గ్రిప్పింగ్ స్టోరీ నరేషన్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ రైడ్ తో తీసుకెళ్లాడు.
ఓవరాల్ గా మిస్టర్ అండ్ మిస్ సినిమా అన్ని వర్గాలప్రేక్షకులు చూసే విధంగా రూపొందించారు. డైరెక్షన్ స్కిల్స్, నిర్మాణాత్మక విలువలు, మంచి మ్యూజిక్, విజువల్స్, డైలాగ్స్ చివరగా హీరో హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయి. సో ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ ర్ ను హ్యాపీగా చూసేయ్యెచ్చు. ముఖ్యంగా యూత్ మిస్ అవ్వకూడని సినిమా ఇది.

PB Rating : 3.25/5