మిఠాయి మూవీ రివ్యూ

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించిన చిత్రం మిఠాయి. ఈ మధ్య కాలంలో ఈ సినిమా టీజర్స్ ట్రైలర్స్, పోస్టర్స్ ఆసక్తికరంగా అనిపించాయి. డిఫరెంట్ సినిమాగా ప్రచారం జరిగింది. ట్రేడ్ లోనూ మంచి బజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రశాంత్ కుమార్ దర్శకుడు. రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు నవ్వించిందో చూద్దాం.

కథేంటంటే :

సాయి (రాహుల్ రామకృష్ణ), జానీ (ప్రియదర్శి) చిన్నప్పటినుంచీ మంచి ఫ్రెండ్స్. రోజు మందు కొడుతుంటారు. ఏ పని చెయ్యకుండా జానీ, సాయితో కలిసి తిని తిరుగుతుంటాడు. సాయి మాత్రం పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. అయితే ఫ్రస్టేషన్ లో ఉద్యోగం మానేస్తాడు. అదే సంయంలో తనకు కాబోయో భార్యకు చైన్ కొని ఉంచుతాడు. తాగిన మైకంలో ఇంటి డోర్ వేసుకోడు. ఆ తర్వాత ఆ చైన్ చోరీ అవుతుంది. ఆ చైన్ ఓ అమ్మాయి మెడలో చూస్తాడు. అలా ఆమెను వెంబడిస్తాడు. ఆమె ద్వారా ఆ చైన్ దొంగ ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ దొంగ దొరికితేనే పెళ్లి చేసుకుంటానని ఫ్రెండ్ తో శపథం చేస్తాడు. ఇంతకూ ఆ దొంగ ఎవరు. ఆ దొంగను పట్టుకున్నారా. సాయి పెళ్లి చెరిగిందా. జానీ సాయికి ఎలా హెల్ప్ చేశాడు. ఇలాంటి విషయాలు మాత్రం థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే.

సమీక్ష
డార్క్ కామెడీ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది. చాలా నాచురల్ గా ఉంటుంది. సహజంగా సన్నివేశాలుంటాయి. మన పక్కనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శ తన పెర్పార్మేన్స్ తో సన్నివేశాల్ని రక్తి కట్టించారు. తమదైన హైదరాబాదీ స్లాంగ్ తో డైలాగ్స్ ఇరగదీశారు. ఊహించని ట్విస్టులతో కథ ముందుకెళ్తుంది. ఈ కథకు ఇద్దరు కమెడియన్స్ పూర్తి న్యాయం చేశారు. వారిద్దరు తాగిన తర్వాత వచ్చే ఫన్ బాగా పేలింది. కమల్ కామరాజు ట్రాక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కమల్ అతని గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చేసే రొమాంటిక్ లిప్ కిస్ సీన్ బాగా కంపోజ్ చేశారు. ఇతని క్యారెక్టరైజేషన్ సినిమా కథను మలుపు తిప్పేదిగా ఉంటుంది. ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయ చేశారు.

డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ డిఫరెంట్ జోనర్, కలర్స్, ప్యాకేజీతో ఈ సినిమా తీశాడు. ఈ తరహా కథ, కథనం మనం గతంలో చూసి ఉంటుంది. విభిన్నమైన కథ, కథనం ఆకట్టుకునేలా ఉన్నాయి. డైలాగ్స్ కూడా చాలా నాచురల్ గా అనిపిస్తాయి. ఆయన రాసిన సీన్స్ డైలాగ్స్ కి రాహుల్ ప్రియదర్శి పూర్తి న్యాయ చేశారు. స్క్రీన్ ప్లే హాలీవుడ్ సినిమాల్ని తలపించేలా ఉంటుంది. సెకండాఫ్ సినిమా పరుగెత్తించింది. మధ్య మధ్యలో రాహుల రామకృష్ణ జాబ్ గురించి చెప్పే స్పీచులు అదరిపోయాయి. ఫస్టాఫ్ లో ప్రియదర్శి బార్ కామెడీ సీన్ అదిరింది. ఎంత ఇంట్రస్టింగ్ గా అయితే కథను మొదలు పెట్టాడో.. ఎక్కడా ఫ్లో తగ్గకుండా చివరివరకు తీసుకెళ్లగలిగాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా డిఫరెంట్ గా ఉంది. కొత్త సౌండ్స్ తో సాంగ్స్ కంపోజ్ చేశాడు. రీ రికార్డింగ్ మరింత హెల్ప్ అయ్యింది. సినిమా మెయిన్ ప్లాట్… ఎంటర్ టైన్ చేయడం. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. లాజిక్స్ పక్కన పెడితే ఎంజాయ్ చేయొచ్చు. కెమెరా వర్క్, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. కథకు తగ్గట్టుగా రిచ్ గా ఖర్చు పెట్టారు.

డార్క్ కామెడీ జోనర్ సినిమాలు మనకు చాలా తక్కువ. ఆ జోనర్ లో వచ్చిన మిఠాయి ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉంది. రాహుల్, ప్రియదర్శ్మి డైలాగ్ కామెడీతో ఇరగదీశారు. దర్శకుడు ప్రశాంత్ కుమార్ డిఫరెంట్ జోనర్ సినిమాను తెరకెక్కించాడు. యూత్ కి బాగా కిక్ ఇచ్చే సినిమా ఇది. సో… గో అండ్ ఎంజాయ్.

PB Rating : 3/5