తెలంగాణలో మోడి, బాబు, పవన్ ప్రచారం

తెలంగాణలో నరేంద్ర మోడి ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే రోజున నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నారు.

భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైనుంచి ప్రసంగించనున్నారు. ఈనెల 22న ఈ బహిరంగ సభలు నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ లో నిర్వహిస్తారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడతో పాటు నర్సాపురం లేదా భీమవరంలో అదే విధంగా తిరుపతి, రాజంపేటలో ఐదు సభలు నిర్వహించే అవకాశముంది.

25 లేదా 26 తేదీల్లో ఈ సభలు నిర్వహించే అవకాశముంది. ఈ సభల్లోనూ మోడి, బాబు, పవన్ పాల్గొంటారు.