మోహన్ బాబు ను కెలికిన శిల్పా చక్రవర్తి

మొన్నటివరకు పద్శశ్రీ పేరుతో గౌరవం పొందిన మోహన్ బాబుకు కోర్టు షాకిచ్చిన విషయంతెలిసిందే. ఇకమీదట పద్మశ్రీ వాడొద్దని కోర్టు ఖరాఖండిగా చెప్పింది. ఈ విషయంపై ఆల్రెడీ మోహన్ బాబు గుర్రుగా ఉన్నాడు. అయితే ఆ ఆగ్నికి ఆజ్యం పోసింది యాంకర్ శిల్పా చక్రవర్తి.

యమలీల2 ఆడియో ఫంక్షన్లో ఓ సీన్ జరిగింది. పద్మశ్రీ మోహన్ బాబు అని శిల్ప సంబోధించింది. వెంటనే మోహన్ బాబు మైకందుకొని… పద్మశ్రీని మోహన్ బాబు తీసుకొచ్చాడు. అంతేగానీ మోహన్ బాబుని పద్మశ్రీ తీసుకురాలేదు. మోహన్ బాబుని మంచి నటుడు అని అంటే సరిపోతుంది.  

ఇక్కడ అవార్డులు శాశ్వతం కాదు. మనుషులు మాత్రమే శాశ్వతం. అయినా ఇప్పుడవన్నీ అప్రస్తుతం. కేసు కోర్టులో ఉంది. వదిలేయండి. అని అన్నారు. 

అసలే పద్మశ్రీ వ్యవహారం మోహన్ బాబును చికాకు పెడుతున్న టైంలో యాంకర్ శిల్పా చక్రవర్తి అనవసరంగా కెలికిందని ఫంక్షన్లో ఉన్నవారు గుసగుసలాడుకున్నారు.