సినిమా రివ్యూ : మూడు పువ్వులు ఆరు కాయలు

సినిమా రివ్యూ : మూడు పువ్వులు ఆరు కాయలు
నటి నటులు : అర్జున్, సౌమ్యవేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమాచౌదరి, తనికెళ్ళ భరణి, పృథ్వి, కృష్ణ భగవాన్
కెమెరా : యం మోహన్ చాంద్
సంగీతం : కృష్ణ సాయి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామస్వామి.
నిర్మాత : వబ్బిన వెంకటరావు

మూడు పువ్వులు ఆరు కాయలు ఒక్క అందమైన కుటుంబ కథ చిత్రం. మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాల కోసం పట్నం వచ్చిన ముగ్గురు ప్రేమికుల కథ. కాయకష్టం చేసి దుఃఖం ని దిగమింగుకుని కొడుకులకి సంతోషం ఇవ్వాలని మంచి స్థానం లో చూడాలనుకునే తలితండ్రుల కథ. అందమైన రొమాంటిక్ సన్నివేశాలతో మనసుకు హద్దుకునే కుటుంబ సన్నివేశాలతో నిర్మించబడిన చిత్రం మూడు పువ్వులు ఆరు కాయలు. అర్జున్, సౌమ్యవేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమాచౌదరి ముఖ్య తారాగణం తో రామస్వామి దర్శకత్వం లో వబ్బిన వెంకటరావు నిర్మించిన చిత్రం మూడు పువ్వులు ఆరు కాయలు. ఈ చిత్రం అక్టోబర్ 12 న విడుదలైంది.

కథ లోకి వెళితే, అర్జున్ (అర్జున్ యాగిత్), నాగ రాజ్ (భారత్ బండారు ) మరియు రామస్వామి ముగ్గురు రూమ్ మేట్స్. అర్జున్ ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, నాగ రాజ్ వ్యవసాయం చేసుకునే తన తలితండ్రులను కష్టం రాకుండా చూసుకోవాలి అని మంచి ఉద్యోగం సంపాదించాలి అని మరియు రామస్వామి అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని పట్నం వస్తారు. ఈ ముగ్గురు సిటీ లో ఎలాంటి సమస్యలు ఎదురుకుంటారు , వారికీ జీవితం ఎలాంటి గుణపాఠం నేర్పుతుంది మరియు వాళ్ళు ఎలా తమ ప్రేమని జీవిత లక్ష్యాన్ని గెలుచుకుంటారు అనేదే సినిమా కథ.

అర్జున్ యాగిత్, భారత్ బండారు మరియు రామస్వామి, ముగ్గురు పాత్రలలో జీవించారు. వారి నటన ఈ చిత్రానికి ఒక్క హైలైట్. హీరోయిన్లు గా నటించిన సౌమ్యవేణుగోపాల్, పావని మరియు సీమాచౌదరి వారి వారి పాత్రలలో చక్కగా నటించారు. పావని పాత్ర కుర్రకారుని ఉరూతలూగిస్తుంది, తన అందచందాలతో యూత్ మరియు మాస్ ప్రేక్షకులని అలరిస్తుంది. తనికెళ్ళ భరణి బలమైన పాత్ర చేసాడు. ప్రతి కొడుకు తనికెళ్ళ భరణి లో తన తండ్రిని చూసుకుంటాడు. అజయ్ ఘోష్ మరో కీలక పాత్రలో కనిపిస్తాడు. పృథ్వి, కృష్ణ భగవాన్ కామెడీ సన్నివేశాలు చాల బాగున్నాయి.

ఈ చిత్రానికి సంగీతం ఒక్క హైలైట్. కృష్ణ సాయి అందించిన పాటలు బాగున్నాయి . ఇటు మరణం అటు ప్రణయం పాట చాల బాగా చిత్రీకరించారు. యం మోహన్ చాంద్ ఫోటోగ్రఫీ మరియు ఆ లొకేషన్స్ చాలా సహజం గా ఉన్నాయ్. మంచి కథ, కథనం తో దర్శకుడు రామ స్వామి అందమైన సినిమా మన ముందుంచాడు. తన మాటలతో ప్రేక్షకుడిని నవ్విస్తాడు, కన్నీరు పెటిస్తాడు మరియు సంతోష పెడతాడు. ఎలాంటి కథలు మనం ఎన్నో చుసిన దర్శకుడు రామ స్వామి చిత్రీకరించిన విధానం ప్రేక్షకుడిని కట్టి పడేస్తుంది.

మూడు పువ్వులు ఆరు కాయలు ప్రతి యువత చూడాల్సిన చిత్రం. ప్రేమంటే చంపుకోవడమో… చావడమో కాదు. చచ్చేదాక కలిసి బ్రతకడమే. కన్నవాళ్ల కలల్ని నిజం చేస్తూ, లక్ష్యాన్ని చేరుకోగలిగితే ప్రతి ఒక్కరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుందన్నదే చిత్ర ఇతివృత్తం. కుటుంబ సమేతం గా చూడదగ్గ చిత్రం.

రేటింగ్ : 3/5