`మౌన‌మే ఇష్టం` మూవీ రివ్యూ

రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్ జంట‌గా ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కుమార్ కోరాల‌త్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `మౌన‌మే ఇష్టం`. ఈ చిత్రంట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ కథల్లో కొత్తదనంతో నిండిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ గా అద్భుతమైన వర్క్ తో పేరు సంపాదించుకున్న ఆశోక్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆశా అశోక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే…

రామ్ కార్తీక్… ఉద్యోగ రిత్యా హైదరాబాద్ వస్తాడు. అనుకోకుండా ఓ ఫంక్షన్ కు వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయి చేసే పనులు చూసి అవాక్కవుతాడు. ఆ తర్వాత ఫంక్షన్ లో మిగిలిన ఆహారాన్ని పేద వారికి పంచడం చూసి ఇంప్రెస్ అవుతాడు. అలా ఆమె గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఆమె ప్రేమ కోసం పరితపిస్తాడు. పార్వతి కూడా రామ్ ని ఇష్టపడుతుంది. అయితే ఎవరికి వారు ముందుగా ప్రపోజ్ చేయాలనుకుంటారు. కానీ ప్రపోజ్ చేసుకోరు. దానికి ఇద్దరికీ బలమైన కారణం ఉంటుంది. ఇంతకూ ఆ కారణం ఏంటి. ప్రపోజ్ చేసే విషయంలో ఎందుకు వెనకడుగు వేశారు. ఇంతకూ వీరి ప్రేమ ఎలా సుఖాంతం అయ్యింది. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష

హీరో రామ్ కార్తీక్ చాలా బాగా నటించాడు. మెచ్యూర్డ్ పెర్ ఫార్మెన్స్ తో పాత్రను మోసుకెళ్లాడు. తన ఫ్రెండ్ తో కలిసి జాలీగా ఉండే పాత్రలో కనిపించాడు. తాతయ్య తో కలిసి ఉండే సీన్స్ లో ఎమోషనల్ గా నటించి చమెప్పించాడు. హీరోయిన్ ను లవ్ లో పడేసేందుకు తపన పడే పాత్రలోనూ మెప్పించాడు. హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేశాడు. హీరోయిన్ పార్వతి చూడాటానికి చాలా బాగుంది. అభినయంతో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ తో పాటు పెళ్లి చూపుల సీన్ లో కామెడీ కూడా చేసింది. ల‌వ్ ఎక్స్‌ప్రెస్ చేయ‌డానికి ఒక జంట మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ఈ చిత్ర‌క‌థ‌. సినిమాను పోయెటిక్ వేలో తీసుకెళ్లాడు దర్శకుడు. విజువ‌ల్స్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తాయి. ద‌ర్శ‌కుడు అశోక్ తన అనుభవాన్ని రంగరించి సన్నివేసాలు రాసుకున్నారనిపించింది. సినిమా కలర్ ఫుల్ గా ఉంటుంది. మంచి ఫ్యామిలీ డ్రామా క్రియేట్ చేశారు. ఫన్నీ సీన్స్ కి నవ్వకుండా ఉండలేం. ప్రతీ ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంటుంది. ఈ సినిమాకు సంగీతం ప్ర‌త్యేక ఆక‌ర్శ‌ణ‌గా నిలుస్తుంది. నాజ‌ర్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. సినిమా మొద‌ట్నుంచి ఒక కావ్యాన్ని చ‌దువుతున్న‌ట్టు వుంటుంది. సురేష్ గ‌డిప‌ర్తి మంచి కథ అందించారు. వివేక్ మ‌హాదేవ్‌ పాటలు సందర్భానుసారంగా బాగున్నాయి. రి రికార్డింగ్ సన్నివేశాల్ని బాగా హైలైట్ చేసింది. జె.డి. రామ తుల‌సి కెమెరా వర్క్ రిచ్ గా ఉంటుంది. ప్రతీ సీన్ కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ను అందంగా చూపించారు. ఆశా అశోక్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా… ఈ తరహా ప్రేమ కథ మనకు ఇంతవరకు రాలేదు. కథ, కథనం కొత్తగా అనిపిస్తుంది. ఫ్రెష్ థాట్ తో, ఫ్రెష్ ఫీలింగ్స్ తో, ఫ్రెష్ సీన్స్ తో దర్శకుడు అశోక్ తెరకెక్కించాడు. ముఖ్యంగా యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. సో గో అండ్ వాచిట్

PB Rating : 3/5