మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ ఇదే

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు తెరలేచింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 29న ఈ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ లోని ఫిలింనగర్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాలులో ఈ ఎన్నికలు జరుగుతాయి.
ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైజ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జెనెరల్ సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీస్, ట్రెజరర్ తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కోసం ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వారు రెండు సంవత్సరాలు( 2015-17 ) తమ పదవుల్లో కొనసాగుతారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.