మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ పాటలు విడుదల

స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రఫీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మిస్టర్ రాహుల్ – పక్కా ప్రొఫెషనల్. రహిల్స్ మూవీ పతాకంపా తెరకెక్కుతోంది. ఈ చిత్ర గీతాలు సోమవారం హైదరాబాద్ లో విడుదలయ్యాయి. ఎవరెస్ట్ అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన పూర్ణ, ఆనంద్ లు ఆడియో సీడీని ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా రఫీ చిత్ర విశేషాలు తెలియజేస్తూ హైదరాబాద్ లోని ఓ మురికివాడలో పుట్టిన యువకుడు సంకల్పబలంతో జీవితంలోతను కోరుకున్న స్థానానికి ఎలాఎదిగాడన్నదే చిత్ర ఇతివృత్తం. హిందూ, ముస్లిమ్ కుటుంబాల నేపథ్యంలో కథ నడుస్తుంది. నేటి యువతకు స్ఫూర్తినిచ్చే చిత్రమిది. కథానుగుణంగా చక్కటి పాటలు కుదిరాయి. అన్నారు. 

ప్రస్తుతం వస్తున్న చిత్రాలు యువతను తప్పుదోవ పట్టించేలా ఉంటున్నాయని, విలువలతో కూడిన సామాజిక సందేశంతో కూడిన చిత్రాల్ని రూపొందించాల్సిన గురుతర బాధ్యత ఔత్సాహిక దర్శకులపై ఉందని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. 

సమాజానికి ఉపయుక్తమయ్యే సందేశంతో తెరకెక్కించిన ఈ చిత్రం విజయం సాధించాలని ఆనంద్, పూర్ణ ఆకాంక్షించారు. 

కెమెరా-అమర్, లక్ష్మణ్

ఎడిటర్ – నందమూరి హరి

పాటలు – అప్సర్ రహిల్, రఫీ