ధోనీ-సాక్షి బుజ్జి బేబీకి డిఫరెంట్ నేమ్… అర్థం ఇదే..!

ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మిస్టర్ కూల్‌గా పేరున్న మహేంద్రసింగ్ ధోనీ-సాక్షి దంపతుల కుమార్తెకు వెరైటీ పేరు ఖరారు చేశారు. శుక్రవారం గుర్గావ్‌లోని ఆసుపత్రిలో ధోనీ సతీమణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాపకు ధోనీ దంపతులు జిబా అనే పేరు ఖరారు చేశారు. జిబా అంటే పర్షియన్ భాషలో అందం అని అర్థం. 

ఇదిలా ఉంటే తండ్రి అయిన ధోనీకి భారత టీం మేనేజ్‌మెంట్ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ సందర్భంగా ధోనీ తన తోటి సహచరులకు తన కుమార్తె పేరు వెల్లడించాడు. ఏదేమైనా కొత్త ఆలోచనలతో భారత క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన ధోనీ తన కుమార్తె పేరును కూడా కొత్తగా పెట్టాడు.