తండ్రి అయిన ధోనీ… సాక్షికి బుల్లి బేబీ పుట్టింది

భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తండ్రి అయ్యాడు. ధోనీ భార్య సాక్షి పండంటి పాపకు జన్మనిచ్చింది. సాక్షి శుక్రవారం గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రసవించింది. ధోనీ దంపతులకు ఇదే తొలి సంతానం. పాప 3.7 కిలోలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

ధోనీ భార్య సాక్షి భారత క్రికెట్ జట్టు విదేశాలకు వెళ్లే ప్రతిసారి ధోనీ వెంటే ఉంటుంది. ఈ సారి ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా వెళ్లిన ధోనీతో మాత్రం వెళ్లలేదు. ధోనీ తన చిన్ననాటి స్నేహితురాలైన సాక్షిని 2010 జూలై 4న వివాహమాడాడు. ప్రస్తుతం ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న ధోనీ తన బుల్లి బేబీని చూసేందుకు మాత్రం కాస్త టైం పట్టనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత బీసీసీఐ అనుమతి ఇస్తే ధోనీ స్వదేశం వచ్చి తన పాపను చూసుకుని వెళ్లే అవకాశాలున్నాయి. లేకుంటే ప్రపంచకప్ ముగిశాకే ధోనీ తన పాపను చూడాలి.