చక్రిని భార్యే చంపేసింది.. నాకు ఫోన్లో చెప్పింది..చక్రి తల్లి ఫిర్యాదు

సంగీత దర్శకుడు చక్రి మృతి కొత్త మలుపులు తిరుగుతోంది. తన కుమారుడు చక్రిని భార్య శ్రావణియే డబ్బుల కోసం చంపేసిందని చక్రి తల్లి విద్యావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ చక్రిని తానే చంపానని భార్య శ్రావణి తనకు ఫోన్ చేసి కూడా చెప్పిందని ఆమె ఫిర్యాదులో తెలిపింది. శ్రావణి కాల్ డేటా పరిశీలిస్తే ఈ విషయం బహిర్గతమవుతుందని కూడా ఆమె అంటున్నారు. చక్రి మృతదేహానికి పోస్టుమార్టం కూడా చేయకుండా శ్రావణియే అడ్డుకుందన్నారు. చక్రి మృతిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. చక్రి మరణానికి 20 రోజుల ముందు ఇంట్లో కూడా గొడవలు జరిగినట్టు ఆమె తెలిపారు. తమను ఇళ్లు వదిలి వెళ్లకపోతే చక్రిని చంపేస్తామంటూ తమను బెదిరించిందన్నారు. అలాగే తాము చక్రి మృతికి ముందే తాము ఇళ్లు వదిలేసి వచ్చామంది. చక్రి చనిపోయి 22 రోజులైనా తాము చక్రి కోసం ఎక్కడా స్పందించలేదని తెలిపింది. కానీ తమ కోడలు మాత్రం మూడో రోజునే మీడియాకు ఎక్కిందని ఆమె చెపుతున్నారు. 

గతంలో చక్రి భార్య శ్రావణి కొద్ది రోజుల క్రితం చక్రి మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని.. అతడిపై విష ప్రయోగం చేసిందని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను వేధిస్తున్న అత్త, ఆడపడుచులతో పాటు కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. అయితే శ్రావణి తప్పుడు ఆరోపణలు చేస్తుందని చక్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.