సంగీత ద‌ర్శ‌కుడు సాకేత్‌పై కిడ్నాప్ కేసు…మైన‌ర్ బాలిక‌తో ప‌రార్‌

సినీ సంగీత ద‌ర్శ‌కుడు సాకేత్ సాయిరాంపై పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. సంగీతంలో శిక్ష‌ణ ఇప్పిస్తాన‌ని చెప్పి..త‌న స్నేహితుడి కుమార్తె అయిన మైన‌ర్ బాలిక‌ను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లిన‌ట్టు ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. ఆ బాలిక‌ను సాకేత్ సాయిరాం త‌ణుకు నుంచి త‌న సొంత వాహ‌నంలో హైద‌రాబాద్‌కు తీసుకు వ‌చ్చిన‌ట్టు ఆ బాలిక త‌ల్లిదండ్రులు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకు పోలీస్‌స్టేష‌న్‌లో కేసు పెట్టారు. చివ‌ర‌కు పోలీసులు ఆ బాలిక ఆచూకి క‌నుగొన‌గా..సాకేత్ సాయిరాం మాత్రం ప‌రారీలో ఉన్న‌ట్టు స‌మాచారం.

1940లో ఒక గ్రామం, పోతే పోని లాంటి 17 చిత్రాల‌కు సాకేత్ సాయిరాం సంగీతం అందించారు. సాకేత్ ఇటీవ‌లే ద‌ర్శ‌కుడి అవ‌తారం ఎత్తి అనుకుందొక‌టి…అయ్యిందొక‌టి సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాకేత్ ఎంతో మందిని న‌మ్మించి మోసం చేయ‌డంతో పాటు అమ్మాయిల‌ను లైంగీకంగా వేధించిన ఆరోప‌ణ‌లు కూడా సాకేత్‌పై ఉన్నాయి.