నాని స్థానంలో సాయిధరమ్ తేజ్ సినిమా?

ఇండస్ట్రీలో ఒకరి దగ్గరకి  వెళ్లిన సినిమా కొన్ని కారణాల వల్ల వేరే హీరోలు ఆ  సినిమా చేసిన దాఖలాలు ఎన్నో తెలుగు సినిమా రంగంలో. ఈ సందర్భంగా రామ్  హీరోగా ‘నేను శైలజ’ అనే సినిమా తీసిన దర్శకుడు కిషోర్ తిరుమల నాచురల్ స్టార్ నాని తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు… అంతేకాకుండా ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కూడా నిర్మిస్తుందని అన్నారు. అయితే ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా నుండి  నాని హీరోగా పక్కకు తప్పుకున్నాడు. 

ఈ క్రమంలో దర్శకుడు కిషోర్ తిరుమల ఇదే సినిమా కథతో మెగా కాంపౌండ్ హీరో సాయి ధరంతేజ్ దగ్గరకు వెళ్లడం జరిగింది…కథ నచ్చడంతో వెంటనే సాయి ధరం తేజ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద నాని దగ్గరికి వెళ్లిన కథ ఇప్పుడు సాయి ధరంతేజ్ హీరో గా తెరకెక్కుతుంది. ఈ సినిమా గురించి త్వరలో అన్నీ విశేషాలు అధికారికంగా ప్రకటిస్తారట సినిమా యూనిట్.