*”ఇస్మార్ట్ శంకర్ ” లో రామ్ – నభా నటేష్ క్యారెక్టరైజేషన్స్ & కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్స్*

‘ఇస్మార్ట్ శంకర్’ అన్నీ సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్
తో విజయ శంఖారావం మ్రోగిస్తోంది. ఈ విజయంలో పూరీ జగన్నాథ్ పవర్ ఫుల్ మాస్
అప్పీల్ తోపాటు కీలకపాత్ర పోషిస్తున్న ముఖ్యమైన విషయాలు రామ్ & నభా నటేష్
క్యారెక్టర్స్ మరియు వారి నడుమ సాగే ఆసక్తికరమైన కెమిస్ట్రీ.. రామ్
మేనరిజమ్స్, తెలంగాణ స్లాంగ్, హెవీ డ్యాన్స్ మూవ్స్ & యాక్షన్ బ్లాక్స్
లో అతడు చూపిన ఈజ్ కి ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుండగా..
వైవిధ్యమైన పాత్రలో నభా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. మొదటి సినిమా
‘నన్ను దోచుకొందువటే’లో క్యూట్ గా ఆకట్టుకున్న నభా ‘ఇస్మార్ట్ శంకర్’లో
అల్ట్రా మాస్ యాటిట్యూడ్ & పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసి మాస్ ఆడియన్స్ కు
మరింత చేరువైంది.
ఈమధ్యకాలంలో తెలుగు సినిమాలో రామ్-నభా ల నడుమ సాగే టిపికల్ రొమాన్స్ &
కెమిస్ట్రీ మరెక్కడా కనిపించలేదు. పూరీ జగన్నాధ్ ప్రత్యేకమైన శ్రద్ధ
తీసుకొని రాసుకున్న ఈ కెమిస్ట్రీ జనాల్ని విశేషంగా ఎంటర్ టైన్ చేస్తోంది.
నిజానికి షూటింగ్ టైంలొనే వారి నడుమ వచ్చే సన్నివేశాలు చూసి క్రూ
మెంబర్స్ భలే ఉన్నాయి అనుకొనేవారట. రామ్-నభా ల నడుమ కెమిస్ట్రీ బాగా
వర్కవుట్ అవుతుండడం చూసి పూరీ ముందు అనుకున్నదానికంటే కొన్ని సన్నివేశాలు
ఎక్కువగా రాసాడట.
రామ్-నభాల రొమాన్స్ మాత్రమే కాదు వారి కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకుల్ని
విశేషంగా ఆకట్టుకొంటోంది. థియేటర్లో జనాలు వారి కాంబినేషన్ సీన్స్ ను
విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, శంకర్-చాందిని పాత్రలు ప్రేక్షకులకు
కొన్నాళ్లపాటు గుర్తుండిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ పాత్రలు
పోషించిన రామ్-నభాలను ప్రేక్షకులు మర్చిపోతారా చెప్పండి. మొత్తానికి నభా
సెకండ్ సినిమా సిండ్రోమ్ ను తప్పించుకొని.. రెండో సినిమాతోనే కమర్షియల్
బ్లాక్ బస్టర్ ను దక్కించుకొంది.