రాంచరణ్ సినిమాలో పవన్ అత్త గారు ..!

హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నదియా…కేరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తర్వాత మిర్చి సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన నదియా తర్వాత పవన్‌కు అత్తగా అత్తారింటికి దారేది సినిమాలో సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది. 

వెంకీ దృశ్యం తర్వాత ఇక్కడ మరో సినిమాకు సైన్ చేయని నదియా.. ఇప్పుడో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్ చరణ్ చిత్రంలో కనిపించడానికి ఓకే చెప్పిందామె. ఛెర్రీ-శ్రీను వైట్ల  కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నదియాను సంప్రదించడం, అందుకు ఆమె అంగీకారం తెలపడం జరిగిందట. ఇందులో అమెది చరణ్ కు తల్లి పాత్ర అంటున్నారు. పాత్ర విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సివుంది.

ఈ చిత్రంలో చరణ్ కు సిస్టర్ గా హీరోయిన్ కృతి కర్బందా నటిస్తోంది. రకుల్ ప్రీత్ కధానాయిక. ఛెర్రీతో నాయక్ లాంటి హిట్ సినిమా నిర్మించిన డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతోంది