నా బెడ్ రూమ్, బాత్రూమ్ ఎవరితో పంచుకోను

ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. నాగార్జున ప్రస్తుతం కేవలం హీరోగానే కాకుండా హోస్ట్ గా కూడా రాణిస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇందులో ఉన్న కంటెస్టెంట్ కూడా రోజుకు ఒక కాంట్రవర్సీ వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా తమన్నా సింహాద్రి ఇప్పుడు సరికొత్త సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే మన్మధుడు 2 సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నాగార్జున బిగ్ బాస్ షో గురించి కూడా మాట్లాడారు. అందులో హోస్టింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మీడియాతో పంచుకున్నారు ఈ సీనియర్ హీరో. తనకు ముందు నుంచి కూడా బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చలేదని మరోసారి చెప్పాడు ఈ హీరో. ప్రస్తుతం హోస్టింగు చేస్తున్నా కూడా అప్పట్లో ఈ షో కాన్సెప్ట్ గురించి తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నాను అంటున్నాడు మన్మథుడు. తన లాంటి వారిని ఆ ఇంట్లో ఉండమని చెబితే రెండు రోజులు కూడా ఉండలేనని.. ఎందుకంటే తన బెడ్ రూమ్ బాత్రూం భార్యతో తప్ప మరొకరితో పంచుకోలేనని స్టేట్మెంట్ ఇచ్చాడు నాగార్జున. దాంతోపాటు మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే ఒక్కరి సక్సెస్ స్టోరీ లు వినేవాడినని.. ఎంజాయ్ చేసే వాడినని.. కానీ ఇప్పుడు బిగ్ బాస్ షోలో మాత్రం మనుషులు మారిపోతున్నారు. ఈ వారం ఉన్నట్లు వచ్చేవారం ఉండటం లేదు.. గత వారం కనిపించినట్లు ఈ వారం కనిపించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తగ్గట్లు మారిపోతున్న వాళ్లను అర్థం చేసుకోవడం కష్టంగా మారింది అంటున్నాడు నాగార్జున. అయినా సరే స్టేజీపై వాళ్లతో సరదాగా మాట్లాడటం.. హోస్టింగ్ చేయడం ఆనందంగా ఉంది అంటున్నాడు మన్మథుడు. బిగ్ బాస్ తనకు కొత్త అనుభవం అంటున్నాడు ఈ హీరో.