ఓ సినిమా రచయిత ప్రేమకథ

ఓ సినిమా రచయిత ప్రేమకథ
నాగవర్మ బైర్రాజు ను హీరోగా పరిచయం చేస్తూ ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ ఓ ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తోంది. హరిచందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యా రావు కథానాయిక. చిత్రం గురించి దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ ” ఓ సినిమా రచయిత ప్రేమకధ ఇది. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ రచయిత ఏమి చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం. ప్రేమకథా చిత్రాల్లో విభిన్నంగా ఉంటుంది”” అని తెలిపారు.
ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ అధినేత మాట్లాడుతూ ” చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో నిర్మాణం జరిగింది. టైటిల్ త్వరలో నిర్ణయిస్తాం. మా హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఫస్ట్ లుక్ రిలేజ్ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సినిమా విడుదలకు సిద్ధమైంది. లాక్ డౌన్ పూర్తియ్యాక సినిమాను విడుదల చేస్తాం” అని తెలిపారు.
నాగవర్మ బైర్రాజు, దివ్యా రావు జంటగా నటించిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, కయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్, taarzan, ఫిష్ వెంకట్, జయవాణి తదితరులు ఇతర ముఖ్యతారాగణం.
సంగీతం సురేష్ ప్రసాద్, ఛాయాగ్రహణం వేణు మురళీధర్, ఎడిటర్ మేనగ శ్రీను, దర్శకత్వం హరిచందన్.