నమస్తే నేస్తమా మూవీ రివ్యూ

బొకాడియా నిర్మించిన చిత్రం నమస్తే నేస్తమా.ఈయన ఇంతకు ముందు హిందీ లో సినిమాలు నిర్మించారు. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ లో ఈయన తీసిన సినిమా నేడే విడుదల అయ్యింది. ఈ చిత్రం లో శ్రీకాంత్ తో పాటు మిగిలిన చాలా మంది నటీ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా లో షాయాజీ షిండే, నాజర్, తాగుబోతు రమేష్ కూడా ప్రధాన పాత్రల లో కనిపించి అందరినీ అలరించారు.ఈ సినిమా ఈ నెల 3 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈసినిమా కథ విషయానికి వస్తే.

కథ:
ఒక పెద్ద బంగళా లో రెండు కుక్కలు తప్పిపోతాయి. అయితే వాటిని ఒక ముఠా ఎత్తుకుపోతుండగా, శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ చూస్తాడు. అయితే వాటిని వెంటనే కాపాడి తన ఇంటికి తీసుకొని వెళ్లి ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతాడు. దానికి రాకీ అనే పేరు కూడా పెడతాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కుక్క కి ఇచ్చే లాగ ట్రైనింగ్ ఇచ్చి ఆ కుక్క ని పెంచుకుంటూ సంతోషం గా ఉంటాడు.ఈ తరుణం లో ఈ సినిమా లో ని విలన్ (షాయాజీ షిండే) ఎంటర్ అవుతాడు. అయితే ఒకానొక దశ లో రాకీ ఎదుట శ్రీకాంత్ హత్య చేయబడతాడు. అది చూసి తట్టుకోలేని రాకీ ఏ విధం గా ప్రతీకారం తీర్చుకుంది అనేది సినిమా కథ.

నటీ నటులు:
ఈ సినిమా లో శ్రీకాంత్ తన పాత్ర పరిధి మేరకు నటించి అందరినీ అలరించాడు. అయితే పోలీస్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు శ్రీకాంత్. తన పాత్ర మొత్తం చాలా బాగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఈశాన్య మహేశ్వరి అందం గా ఉండటమే కాకుండా ఒక మాస్ పాత తో కూడా అందరినీ అలరించింది. ఇక పోతే కుక్కలు కూడా ఈ సినిమా లో బాగా నటించి అందరి మెప్పుని పొందాయి. అన్ని విధాలు గా ఈ సినిమా లో నటీ నటులు తమ పాత్రల మేరకు బాగా నటించి అందరినీ అలరించారు. అలాగే బ్రహ్మానందం,తాగుబోతు రమేష్, షాయాజీ, ఇక ఇతరులు కూడా బాగా చేశారు.

సమీక్ష:
ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ అవ్వడం తో సంగీతం చాలా అవసరం పడింది. ఈ సినిమా లో బప్పీ లహరి మంచి నేపథ్య సంగీతం అందించారు. రాకీ మేరా నామ్ అనే పాట చక్కగా కుదిరింది. ఈ సినిమా లో కథ రొటీన్ గా ఉన్నప్పటికీ ఈ సినిమా లో ప్రతీకార చర్య అనే నేపథ్యం చక్కగా చూపించారు. అలాగే తెలుగు సినిమా కి ఒక కథ ని కొత్తగా అందించడం లో దర్శక నీమాతలు విజయం పొందారు.బొకాడియా ఈ సినిమా ని తెరకెక్కించిన విధానం బాగుంది. అందరి తో మంచి పని ని రాబట్టుకుంటూ, ఈ సినిమా ని అంతర్జాతీయ స్థాయి లో తెరకెక్కించారు. నమస్తే నేస్తమా అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. పిల్లలు మరియు పెద్దలు ఈ సినిమా ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ సినిమా లో కథ బాగుంది. అలాగే ఈ సినిమా కి టెక్నీకల్విషయం. గా కూడా అందరూ మంచి సహకారం అందించారు. ఒక మనిషికి మరియు ఒక కుక్క కి ఉన్న రిలేషన్ ని ఒక చక్కటి కథ ద్వారా అందంగా చూపించడం మనం అభినందించ తగ్గ విషయం.