నమిత, సంధ్య, భాను, రేఖ ఫైర్ పాటల రిలీజ్

రిషి, బషీద్ హీరోలుగా నమిత, ప్రేమిస్తే సంధ్య, భానుమెహ్రా, రేఖ నాయికలుగా రూపొందుతున్న చిత్రం ఫైర్. బషీద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంలోని పాటలు సోమవారం మధురా ఆడియో ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి.

ఈ సందర్భంగా నిర్మాత బషీద్ మాట్లాడుతూ… ఇదొక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. ముక్కోణపు ప్రేమకథకు అన్ని కమర్షియల్ అంశాలు జోడించి రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నమిత, రేఖ అందచందాలు, బ్రహ్మానందం వినోదం ఆస్ట్రేలియా, బ్యాంకాక్, హాంకాంగ్ లో చిత్రీకరించిన పాటలు, సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. మే 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని తెలిపారు.

ఎమ్మెస్ నారాయణ, దువ్వాసి మోహన్, నల్లవేణు, వేణుమాధవ్, తెలంగాణ శకుంతల తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – ఎం.ఎం.శ్రీలేఖ