క్యాన్సర్ చిన్నారి కోరిక మేరకు గుంటూరు వచ్చిన బాలకృష్ణ

సినీనటుడు నందమూరి బాలకృష్ణ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించారు. గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన శ్రావణి(12) అనే బాలిక క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఆమె తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆ చిన్నారికి హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేయించారు. ఇటీవల వరకు అచేతనావస్థలో ఉన్న ఆ చిన్నారి వైద్యుల కృషి మేరకు కోమా నుంచి బయటకు వచ్చింది. దీంతో ఆమె వెంటనే తన అభిమాని బాలయ్యను చూడాలన్న విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయం బాలయ్యకు చేరడంతో ఆయన మంగళవారం స్వయంగా గుంటూరు జిల్లా నరసారావుపేటకు వెళ్లి ఆ చిన్నారితో అరగంట సేపు ఆడిపాడారు. స్వయంగా తన అభిమానే తన వద్దకు వచ్చి తనతో గడపడంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.