ఉగాది రోజు నాని వర్సెస్ నాని..ఒకే రోజు రెండు సినిమాలు

టాలీవుడ్‌లో ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ కాకుండానే ఇటీవల కాలంలో జాగ్రత్తలు తీసుకుంన్నారు. కలెక్షన్లకు ఇబ్బంది లేకుండా కనీసం వారం రోజులు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

కానీ యంగ్ హీరో నాని నటించిన రెండు సినిమాలో ఉగాది సందర్భంగా ఈ నెల 21న రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల రిలీజ్ పోస్టర్ కూడా వచ్చేశాయి. దీంతో ఉగాది రోజు నాని సినిమాతో నాని సినిమాకే పోటీ ఎదురు కానుంది.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను ప్రియాంకదత్ నిర్మిస్తున్నారు. ఇక జెండా పై కపిరాజు సినిమా కోలీవుడ్‌లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు నిర్మాత తెలుగులో నానిని సంప్రదించకుండా రిలీజ్ చేస్తుండడంతో నాని కేవలం ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు మాత్రమే ప్రమోషన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏదీ బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తుందో ఉగాది వరకు ఆగాల్సిందే.