బాలీవుడ్‌లోకి నారా రోహిత్ మూవీ

నారా వారి వారసుడు నారా రోహిత్ సినిమా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. నారా రోహిత్ హీరోగా శ్రీలీలా మూవీస్ పతాకంపై కెఎస్.రామారావు సమర్పిస్తున్న శంకర మూవీ తమిళంలో హిట్ అయిన మౌనగురుకు రీమేక్. శంకర్ తెలుగులో త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను బాలీవుడ్‌లో రూపొందించేందుకు ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ సిద్ధమవుతున్నారని టాక్. దక్షిణాదిలో హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్‌లో తెరకెక్కించి హిట్ కొట్టడంలో మురుగదాస్ సిద్ధహస్తుడు. దక్షిణాదిలో సంచలనం సృష్టించిన గజనీ సినిమాను మురుగదాస్ బాలీవుడ్‌లో రీమేక్‌చేసి బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

కాలేజ్ నేపథ్యంతో పాటు క్రైమ్ ఆథారంగా తమిళ దర్శకుడు శాంతకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కడ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా టాలీవుడ్, బాలీవుడ్‌లో ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.