నారా రోహిత్ నిర్మిస్తున్న నలదమయంతి షురూ

రవిపనస ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నారా రోహిత్ సమర్పణలో నల దమయంతి చిత్రం శుక్రవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్రముఖ రచయిత, దర్శకులు విజయేంద్రప్రసాద్ దగ్గర పనిచేసిన కోవెరా దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో రాయల్ రాజుగా, ప్రతినిధిలో శ్రీకర్ గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన శ్రీ విష్ణు ఈ చిత్రంలో కథానాయకుడు. ఓ ప్రముఖ నటి కథానాయికగా నటిస్తుండగా మరో నాయికగా నిఖితా నారాయణ్ నటించనుంది. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి నిర్మాత రవి పనస క్లాప్ ఇచ్చారు. హీరో శ్రీ విష్ణు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 

రవి పనస మాట్లాడుతూ… ఈనెల 2 నుంచి 12వ తేది వరకు మొదటి షెడ్యూల్ జరుగుతుంది. మే 20 నుంచి జూన్ 20 వరకు మరో షెడ్యూల్ చేస్తాం. తరువాత కేరళలో 15 రోజుల పాటు చివరి షెడ్యూల్ ఉంటుంది. ఇందులో నటించనున్న ప్రముఖ హీరోయిన్ తదితర వివరాలను త్వరలో తెలియజేస్తాం. అని అన్నారు. 

మాటలు – మహి ఇల్లీంద్ర

డిఓపి – పి.జి.విందా

ఆర్ట్ – రాజీవ్ నాయర్

ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి

సంగీతం – సత్య మహావీర్

సమర్పణ – నారా రోహిత్

నిర్మాత – రవి పనస

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – కోవెరా