‘నవాబ్ బాషా’ ఆడియో రిలీజ్ వేడుక

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కదం తొక్కుతున్న ఎమ్మెస్ నారాయణ ఇప్పుడు నవాబ్ అవతారంలో మన ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతున్నాడు. డైరెక్టర్ బి.రాజేష్ తెరకెక్కిస్తున్న ‘నవాబ్ బాషా’ చిత్రంలో ఎమ్మెస్ నారాయణతో కలిసి గరిమాజైన్(జూనియర్ నగ్మా) నటిస్తోంది. ఎమ్మెస్ నారాయణ కెరీర్ లోనే తొలిసారిగా ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘నవాబ్ బాషా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పాటలు తాజాగా ఫిలించాంబర్ లో విడుదలయ్యాయి. 

ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ముఖ్య అతిథిగా పాల్గొని పాటల సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. దర్శకుడు బి. రాజేశ్ పుత్ర మాట్లాడుతూ పాటల చిత్రీకరణ బాగా వచ్చిందని, సినిమా కూడా బాగా వస్తోందని,చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఇదే వేదికపై కె. కాశీవిశ్వేశ్వర్ రావు నిర్మిస్తున్న ‘తారంగం తారంగం’ చిత్ర గీతాలను కూడా అతిథులుగా చేతులమీదుగా విడుదల చేయించారు. 

ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ బి. రాజేశ్ పుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. మల్లి మామిడి అందించిన పాటలకు సునీల్ పుత్ర స్వరకల్పన చేశారు. ‘డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్’ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు డైరెక్టర్ రాజేష్ పుత్ర తెలిపారు. కామెడీ ప్రధానాంశమైన ఈ సినిమాను నవాబ్ కాలం నాటి ఓ యదార్థగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. సినిమా సంతృప్తికరంగా వస్తోందని, ఎమ్మెస్ నారాయణ అద్భుతమైన పర్ఫామెన్స్ చూపిస్తున్నారని దర్శకుడు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్లతో పాటు సాంకేతిక నిపుణులు, నటీనటులు, కొరియోగ్రాఫర్ సింహాచలం నాయక్, గుంటుకు విజయ్, మిస్టర్ వరల్డ్ ఇస్సా మిస్త్రి తదితరులు పాల్గొన్నారు. 

నవాబ్ బాషా నటీనటులు: 
ఎమ్మెస్ నారాయణ, గరిమాజైన్, రాహుల్, గుంటుకు విజయ్, వినోద్, శిరీష, జెన్నీ శాంతి స్వరూప్, స్నేహ, విలీన్యరాయ్ ప్రియ.

సాంకేతిక వర్గం:
కెమెరా: శ్రీనివాసరెడ్డి కంకణాల
సంగీతం: సునీల్ పుత్ర
గేయ రచయిత: మల్లిమామిడి
ఎడిటర్: సునీల్ అళహరి

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:
బి. రాజేష్ పుత్ర