నాయ‌కి.. న‌ర‌కానికి దారి..

స్టార్ ఇమేజ్ ఉన్న‌పుడు నేను ఇలాంటి పాత్ర‌లు మాత్ర‌మే చేస్తాను.. ఇవి చేయ‌ను.. నాక‌వి కావాలి.. ఇవి కావాలి.. అని గొంతెమ్మ కోర్కెలు. ఒక్క‌సారి ఇమేజ్ పోయిందంటే ఇండ‌స్ట్రీలో వ్యాల్యూ కూడా పోతుంది. ఒక‌ప్పుడు మిమ్మ‌ల్ని చూసి సార్ అన్న‌వాళ్లే.. ఇమేజ్ లేక‌పోతే క‌నీసం దండం కూడా పెట్ట‌రు. హీరోయిన్ల విష‌యంలోనూ అంతే. స్టార్ హీరోయిన్ గా ఉన్న‌పుడు వాళ్లు చేసే వేశాలు అన్నీ ఇన్నీ కావు. ఆ భ్ర‌మ‌లోనే ఉంటూ కొన్నాళ్లూ అవ‌కాశాలకు కూడా దూర‌మ‌వుతారు. కానీ త్రిష మాత్రం త‌న ఇమేజ్ ఏంటో ముందే తెలుసుకుంది. అందుకే చిన్న సినిమాలైనా ప‌ర్లేద‌ని అన్నింటికి ఓకే చెప్పేస్తుంది. ఆ చిన్న సినిమాల్లోనూ అందాల ఆర‌బోత రెచ్చిపోయి చేస్తోంది. ఈ మ‌ధ్యే వ‌చ్చిన క‌ళావ‌తిలో ఏకంగా బికినీలో సెగ‌లు పుట్టించిన త్రిష‌.. ఇప్పుడు నాయ‌కి సినిమా కోసం హాట్ క్లీవేజ్ షోస్ చేసింది. కానీ ఎన్ని చేసిన కాలం క‌లిసిరావ‌ట్లేదు.

కెరీర్ లోనే ఫ‌స్ట్ టైమ్ ఫుల్ టైం దెయ్యంగా న‌టించింది త్రిష‌. నాయ‌కి సినిమాలో ఈ చెన్నై చంద్రం ఘోస్ట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ సినిమాను గోవి డైరెక్ట్ చేసాడు. ఈయ‌న తొలి సినిమా ల‌వ్ యూ బంగారం. మారుతి స్కూల్ నుంచి వ‌చ్చిన ఈ ద‌ర్శ‌కుడు.. తొలి సినిమాలో కావాల్సినంత బూతును మిక్స్ చేసి విమ‌ర్శ‌లు కూడా అందుకున్నాడు. అలాంటి ద‌ర్శ‌కుడితో కంటెంట్ నమ్మి ఓకే చేసింది. నాయ‌కి సినిమా విడుద‌లైంది. క‌నీసం సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ట్లేదు. అంత‌గా సినిమా డిజాస్ట‌ర్ గా మారింది. దెయ్యంగా భయపెట్టలేకపోయింది. కామెడీతో నవ్వించలేకపోయారు. సినిమా టాక్ బ్యాడ్ గా ఉండడమే కాదు.. కనీసం చేయాల్సిన రీతిలో ప్రమోషన్ సైతం చేయకపోవడం పెద్ద మైనస్ గా మారింది. త్రిష సైతం ప్రమోషన్ కు రానని చెప్పేసిందట. సినిమా రిజల్ట్ ముందే తెలిసి రాలేదో లేక రెమ్యూనరేషన్ లో తేడాలొచ్చాయే మరి. ఏది ఏమైనా… నాయకి చూసిన వారు సైతం నరకానికి దారి అనే కామెంట్స్ చేస్తున్నారు.