న‌య‌న‌తార‌కు అంత అవ‌ర‌స‌మా..?

చిరంజీవి సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. మాకు ఆ అవ‌కాశం వ‌స్తే బాగున్ను అని కొంద‌రు హీరోయిన్లు కోటి దేవుళ్ల‌కు మొక్కుతున్నారు. కానీ మెగాస్టార్ మ‌న‌సు మాత్రం కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార వైపు వెళ్తుంది. డిమాండ్ ఉన్న‌పుడు క్రేజ్ కూడా అలాగే ఉంటుంది. రెమ్యున‌రేష‌న్ కూడా అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు న‌య‌న‌తార కూడా ఇదే చేస్తుంది. అక్క‌డ ఉన్న‌ది చిరంజీవి అయినా.. వెంక‌టేశ్ అయినా త‌న రెమ్యున‌రేష‌న్ లెక్క ఇది అని నిర్మాత‌ల‌కు క‌ళ్లు బైర్లు గ‌మ్మే లెక్క‌లు చెబుతుంది న‌య‌న‌తార‌.

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీలో న‌య‌న ఆల్ మోస్ట్ ఫిక్స్. ఇక ఇందులో ఎలాంటి మార్పుల్లేవు. ఎందుకంటే ఇప్పుడున్న హీరోయిన్ల‌లో అనుష్క‌, న‌య‌న మాత్ర‌మే చిరు ఏజ్ కు, ఫిజిక్ కు స‌రిపోతారు. మిగిలిన ఏ భామ‌ను తీసుకున్నా మ‌రీ చిన్నోళ్ల‌లా క‌నిపిస్తారు. దాంతో ఆప్ష‌న్ లేదు మీకు.. అర్థ‌మైంది నాకు అన్న‌ట్లు న‌య‌న‌తార ఆడుకుంటుంది. అనుష్క ఎలాగూ బిజీ. పైగా ఆమె కంటే న‌య‌నే బెట‌ర్ అనే ఆలోచ‌న‌లో ఉన్నారు చిరు. దాంతో అడిగినంత ఇచ్చేయండంటూ నిర్మాత‌ల‌కు సూచించాడు చిరంజీవి.

చిరంజీవి క‌త్తి రీమేక్ లో న‌టించ‌డానికి న‌య‌న‌తార ఏకంగా రెండున్న‌ర కోట్లు తీసుకుంటుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఏ భామ‌కు అంత మొత్తం ఇవ్వ‌లేదు. చిరంజీవి సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డ‌మే ఓ అదృష్ట‌మనుకుంటే.. ఏకంగా రెండున్న‌ర కోట్లు తీసుకోవ‌డం మ‌రో అరుదైన అదృష్టం. ఇప్ప‌టికే మే నుంచి డేట్స్ కూడా అలాట్ చేసింది న‌య‌న‌తార‌. ఒక్క‌సారి కూతురు పెళ్లి పూర్తైన వెంట‌నే చిరంజీవి కూడా క‌త్తి రీమేక్ పై మ‌న‌సు పెట్ట‌నున్నారు. ఎప్రిల్ లో షూటింగ్ మొద‌లుపెట్టి.. మే లో రెగ్యుల‌ర్ షూటింగ్ వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు వివి వినాయ‌క్.