నీకోసం మూవీ రివ్యూ….

ఎన్ని ప్రేమ కథలు వచ్చినా… ప్రతీ కథ ప్రత్యేకమే. అందుకే యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్స్ కి డిమాండ్ అంత ఎక్కువ. తాజాగా ఆ జాబితాలోనే చేరింది నీకోసం చిత్రం. నిజ జీవితం లో చూసినటువంటి…. విన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ పుట్టింది. కొత్తదనం నిండిన కథ తో ఎంటర్టైన్ చేసేందుకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అవినాష్ కోకటి అనే యువ దర్శకుడు దర్శకత్వం వహించాడు. అరవింద్ రెడ్డి. సుభాంగి పంత్ ఓ జంటగా… అజిత్ రాధారామ్, దీక్షితా పార్వతిలు మరో జంటగా నటించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం.

కథేంటంటే : అరవింద్ రెడ్డి.. సుభాంగి పంత్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే ఇద్దరి మధ్య తరచు చిన్న చిన్న గొడవలొస్తుంటాయి. అదే సమయంలో అరవింద్ కు తన మిత్రుణ్ని కలవడానికి వెళ్లగా అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ లో అరవింద్ రెడ్డికి గాయాలయ్యి ఆసుపత్రి లో చేరతాడు. అదే సమయంలో అక్కడ ఓ డైరీ దొరుకుతుంది. అందులో అజిత్ రాధారామ్, దీక్షితా పార్వతిల ప్రేమకథ రాసి వుంటుంది. అజిత్ బాంబ్ బ్లాస్టులో చనిపోయాడని భావించిన అరవింద్… వారిద్దరి ప్రేమకథను తెలుసుకుంటూనే… మరోవైపు తన ప్రియురాలితో ప్రేమను సాగిస్తూ… తనతో తరచు గొడవ పడుతూ వుంటాడు. మరి ఇలా సాగిపోతున్న వీరిద్దరి ప్రేమ చివరకు ఏమైంది? అసలు అజిత్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడా? అజిత్.. దీక్షితా పార్వతిల ప్రేమ ఫలించిందా? అసలు బాంబు బ్లాస్టులో చనిపోయింది ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష
రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా యూత్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. మనిషి పోయిన తర్వాత కంటే….. ఉన్నప్పుడే ఆ ప్రేమని పంచుకుంటే జీవితం చాలా బాగుంటుంది అనేది ఈ చిత్రం మెయిన్ థీమ్. అదే నీ కోసం సినిమా లో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. మర్చిపోయిన.. లేదా వదిలేసిన రిలేషన్స్ అన్నీ మళ్లీ గుర్తొస్తాయి. అరవింద్.. సుభాంగిల మధ్య లవ్ ట్రాక్ ను తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రేమికుల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలను మనం నిత్యం చూస్తూనే వుంటాం. అందులో ముఖ్యమైంది సెల్ ఫోన్ బిజీ రావడం.. కాల్ వెయిటింగ్ రావడం.. దాందో వారిద్దరి మధ్య విబేధాలు తలెత్తి.. మనస్పర్ధలకు దారితీయడం.. తరువాత రాజీ పడటం లాంటి నిత్యజీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలను సైతం ఇందులో ఆసక్తికరంగా చూపించారు. ప్రేమికుల మధ్య వుండే సున్నితమై బంధాలను తెరమీద ఎంతో చక్కగా చూపించారు దర్శకుడు.

హీరో అరవింద్ రెడ్డి పక్కింటి అబ్బాయిలా కనిపించారు. పెర్ ఫార్మెన్స్ చాలా బాగుంది. కథను తన భుజాలమీదేసుకున్నాడు. ముఖ్యంగా లవ్, ఎమోషనల్ సీన్స్ ని బాగా పండించాడు. ఈ సినిమా ఆరవింద్ కు మంచి పేరు తీసుకొస్తుంది. కొత్త వాళ్లు అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. మరో హీరో అజిత్ రాధారామ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. క్యారెక్టర్ కు తగ్గ హావభావాలతో మెప్పించాడు. హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేశాడు. హీరోయిన్ సుభాంగి పంత్ ఎంతో నెమ్మదస్తురాలిగా… తన ప్రియుడి మనోభావాలు ఎరిగిన సాఫ్ట్ వేర్ అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. మరో హీరోయిన్ దీక్షితా పార్వతి సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యారు. వీరిద్దరు తమ పాత్రలకు న్యాయం చేశారు. అందం అభినయంతో ఆకట్టుకున్నారు. కమెడియన్స్ గా సుదర్శన్, సాయి పంపన నవ్వించారు.

దర్శకుడు అవినాష్ రాసుకున్న కథ.. కథనం కొత్తగా బాగున్నాయి. సున్నితమైన భావోద్వేగాల్ని, లవ్ ట్రాక్ ని బాగా హ్యాండిల్ చేయగలిగాడు. లవ్ స్టోరీనే కాదు.. లైఫ్ స్టోరీ’ వుందని నిరూపించారు. ముఖ్యంగా యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ దర్శకుడు శ్రీనివాస్ శర్మ మంచి పాటలు అందించాడు. సందర్భానుసారంగా వచ్చే ప్రతీ పాట వినసొంపుగా ఉంది. రీ రికార్డింగ్ లోనూ తన టాలెంట్ చూపించాడు. రాజలింగం సమర్పణలో అల్లూరమ్మ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి. కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టారు. మంచి క్వాలిటీ సినిమా నిర్మించారు. శివక్రిష్ణ యెడుల పురమ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ ఫ్రేమ్ ను అందంగా మలిచాడు. కథ కు తగ్గ విజువల్స్ తో స్క్రీన్ ను బ్యూటిఫుల్ గా మలిచాడు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. క్రాంతి ప్రియ ఆర్ట్ చాలా బాగుంది.

ఓవరాల్ గా….
మంచి ప్రేమ కథా చిత్రాన్ని అద్భుతమైన భావోద్వేగాల నడుమ రూపొందించారు. ఈ తరహా కథ కథనం మనకు కొత్తే. ఆర్టిస్టులు కొత్త అయినప్పటికీ… ఆ ఫీలింగ్ రాకుండా ఆర్టిస్టులచే పెర్ ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు దర్శకుడు. కేవలం యూత్ నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథ కథనం ఇందులో ఉన్నాయి. సరికొత్త ప్రేమ కథా చూడాలనుకునే వారు డోంట్ మిస్ ఇట్. గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5