నీ కోసమే నా నిరీక్షణ ప్రారంభం

 సన్నీరాజ్‌, వికాస్‌, రవిచంద్ర, అక్షిత్‌, వైశాలి, ప్రియా, గ్రీష్మా, హరిత, దేవా, ప్రతాప్‌ ముఖ్య తారాగణంగా యువ ప్రతిభాశాలి రాజేంద్ర నాయక్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ప్రముఖ వ్యాపారవేత్త రిజ్వన్‌ అహ్మద్‌ ‘స్కైవేస్‌ ప్రొడక్షన్స్‌’ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నీ కోసమే నా నిరీక్షణ’.

ఈ చిత్రం ప్రారంభోత్సవం ఏప్రిల్‌ 15, ఉదయం 11.00 గం॥లకు రామానాయుడు స్టూడియోలో జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్లు సన్నీరాజ్‌` వైశాలిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌ కొట్టగా.. యువ రాజకీయనాయకుడు నవీన్‌ యాదవ్‌ (ఎం.ఐ.ఎం) కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మరో ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ (గోపి) గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో

చిత్ర నిర్మాత రిజ్వన్‌ అహ్మద్‌ మాట్లాడుతూ… ‘మంచి కథ`కథనాలు సిద్ధం చేసుకొని, ఎంతో కసితో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాజేంద్ర నాయక్‌ను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తుండడం సంతోషంగా ఉంది. నేను సినిమా రంగానికి కొత్తయినప్పటికీ` అనుభవజ్ఞుల సలహాలు, సూచనలతో ఈ సినిమాను అనుకొన్న విధంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని సైతం సమకూర్చుతున్న దర్శకుడు రాజేంద్ర నాయక్‌ మాట్లాడుతూ… ‘పాటల రికార్డింగ్‌ పూర్తి చేశాం. ముందుగా పాటల చిత్రీకరణ పూర్తి చేసి, ఆ తరువాత టాకీ చిత్రీకరించనున్నాం. ఈనెల 26 నుంచి షూటింగ్‌ ప్రారంభించనున్నాం. ధనిక, మధ్య తరగతి, దిగువ తరగతికి చెందిన యువతీయువకుల విద్యార్ధి దశలోని సంఘర్షణాత్మక సంఘటనల సమాహారంగా.. ఆద్యంతం అత్యంత వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. ఈ అవకాశాన్నిచ్చిన మా నిర్మాత రిజ్వన్‌ అహ్మద్‌ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను’ అన్నారు.

మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరూ ‘నీ కోసమే నా నిరీక్షణ’ చిత్రానికి పని చేస్తుండడం పట్ల తమ సంతోషాన్ని తెలియజేశారు.

రావు రమేష్‌, ఎల్‌.బి.శ్రీరాం, తనికెళ్లభరణి, తాగుబోతు రమేష్‌, సురేఖావాణి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్టిల్స్‌: పృధ్వి, కెమెరా: దుర్గాప్రసాద్‌,
ఎడిటర్‌: సామ్రాట్‌, కొరియోగ్రాఫి: చార్లిస్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌: ఆనంద్‌,
సహ`నిర్మాత: బి.మధుసూదన్‌రావు, నిర్మాత: రిజ్వన్‌ అహ్మద్‌,
కథ`స్క్రీన్‌ప్లే`సంగీతం`దర్శకత్వం: రాజేంద్ర నాయక్‌!

press note